
స్టార్ డిస్ట్రిబ్యూటర్ 'ఫికస్ డిస్టిబ్యూషన్ సంస్థ'అధినేత హరీష్ సజ్జ (Harish Sajja) ఆకస్మిక మరణం చెందటంతో తెలుగు సిని పరిశ్రమలో విషాద ఛాయిలు అలుముకున్నాయి. అమెరికాలో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే హరీష్ సజ్జా హార్ట్ అటాక్తో కన్నుమూశారు.ఓవర్ సీస్లో ఎన్నో తెలుగు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన హరీష్ సజ్జ దాదాపు పెద్ద ప్రొడ్యూసర్స్ కు, హీరోలకు పరిచయమే.
అట్లాంటాలోని ఇంట్లో ఉండగా ఆకస్మకింగా గుండెపోటు రావడంతో..హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అయన మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. హరీష్ సజ్జా ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు,హీరోలు తమ సంతాంపం తెలిపుతున్నారు.
హరీష్ స 2006 సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన రాఖీ మూవీతో యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో వరస సినిమాలు చేసారువ. పెద్ద సినిమాలకు కేరాఫ్ గా యూఎస్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా పేరుతెచుకున్నారు.ముఖ్యంగా 2008 నుండి 2016 వరకు దాదాపు ఒక పదేళ్ల పాటు యుఎస్‌లో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు.
ఆ సమయంలో ఆయన డిస్ట్రిబ్యూటర్ చేసిన చిత్రాల్లో మహేష్ బాబు కెరీర్ లో అమెరికాలో ఫస్ట్ 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమా దూకుడు ఒకటి .ఇది అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా దూకుడు నిలిచింది.అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,రోబో,రేస్ గుర్రం,1నేనొక్కడినే,ఆగడు,జనతా గ్యారేజ్ మొదలైన అనేక భారీ చిత్రాలను ఓవర్ సీస్ లో పంపిణీ చేసారు. గత కొంతకాలంగా ఆయన డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.