విజయ్ తో మావల్ల కాదన్నారట, అందుకే చరణ్ ని సెట్ చేసిన శంకర్?

Published : May 28, 2021, 07:31 PM ISTUpdated : May 28, 2021, 07:38 PM IST
విజయ్ తో మావల్ల కాదన్నారట, అందుకే చరణ్ ని సెట్ చేసిన శంకర్?

సారాంశం

హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్ కోసమే రూ. 150 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. మిగతా సినిమా బడ్జెట్ మరో 150 నుండి 200కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపలేదట.

ఆర్ ఆర్ ఆర్ తరువాత హీరో రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో జతకట్టనున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా కథ, కథనాలపై ఇప్పటికే అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని, ఈ మూవీలో చరణ్ సీఎంగా కనిపిస్తారని కొన్ని వార్తల సారాంశం. ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 


కాగా నిజానికి ఈ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ విజయ్ చేయాల్సింది. మాస్టర్ మూవీ తరువాత విజయ్, శంకర్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్, శంకర్ మధ్య చర్చలు కూడా ముగిశాయట. అయితే ఈ ప్రాజెక్ట్ కి నిర్మాత దొరకలేదని కోలీవుడ్ లో నడుస్తున్న వార్త. హీరో విజయ్ రెమ్యూనరేషన్ దాదాపు వంద కోట్లకు చేరింది. అలాగే దర్శకుడు శంకర్ మరో యాభై కోట్ల రూపాయల వరకు తీసుకుంటారు. 


హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్ కోసమే రూ. 150 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. మిగతా సినిమా బడ్జెట్ మరో 150 నుండి 200కోట్ల రూపాయల వరకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ పై నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపలేదట. దీంతో పాటు గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 3 ఇడియట్స్ రీమేక్ స్నేహితుడు పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా, భారీ బడ్జెట్ కావడం వలన నష్టాలు మిగిల్చింది. అందుకే నిర్మాతలు ఈ కాంబినేషన్ అంటే ముందుకు రాలేదట. 


విజయ్ తో పోల్చుకుంటే చరణ్ రెమ్యూనరేషన్ తక్కువ. అలాగే ప్రాఫిట్ షేరింగ్ బేసిస్ పై శంకర్-చరణ్ కాంబినేషన్ లో మూవీ చేయడానికి నిర్మాత దిల్ రాజు ముందుకు వచ్చారట. అలా విజయ్ చేయాల్సిన శంకర్ మూవీ చరణ్ చేతికి పోయింది అనేది తమిళ మీడియా వాదన. కాగా గతంలోనే భారతీయుడు 2 చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు ఉండాలని అనుకున్నారు. కారణం ఏమిటో కానీ దిల్ రాజు తరవాత వెనక్కి తగ్గారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?