అభిమానులకు ఎన్టీఆర్ ఆనాటి లేఖ..!

Published : May 28, 2021, 04:49 PM IST
అభిమానులకు ఎన్టీఆర్ ఆనాటి లేఖ..!

సారాంశం

ఎన్టీఆర్ 1975లో అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానుల ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన లేఖ ఈ విధంగా రాశారు. 


యుగపురుడు ఎన్టీఆర్ జయంతి నేడు. సోషల్ మీడియా వేదికగా చిత్ర ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులు తెలుపుతున్నారు. నటుడిగా, నేతగా ఎనలేని కీర్తి గడించి అత్యున్నత శిఖరాలు అందుకున్న ఆయన మహోన్నతి స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ తన జీవితంలో సాధించిన అనేక విజయాలు, ప్రజా సేవ, తెలుగు జాతికి తెచ్చిన గుర్తింపు గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. 


కాగా ఎన్టీఆర్ 1975లో అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానుల ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞత తెలుపుతూ ఆయన లేఖ ఈ విధంగా రాశారు. ''అభిమానమును మించిన ధనము...  ఆదరమున మించిన పెన్నిధి ఈ లోకాన లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట, ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్టే. మీకు శుభాకాంక్షలు. సోదరుడు రామా రావు'' అంటూ ఫ్యాన్స్ కి బహిరంగ లేఖ రాశారు. 


దశాబ్దాల పాటు వెండితెర వేలుపుగా ఎన్టీఆర్ కీర్తించబడ్డాడు. అభిమానులు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ఋణం తీర్చుకోవాలనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి ప్రజారంజక పాలన అందించారు. కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఆయన మనవడు కళ్యాణ్ రామ్ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. బింబిసారా అనే హిస్టారిక్ మూవీని కళ్యాణ్ రామ్ ప్రకటించడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌