బిగ్ బాస్ కౌశల్ భార్యకు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్?

Published : May 28, 2021, 06:50 PM IST
బిగ్ బాస్ కౌశల్ భార్యకు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్?

సారాంశం

కౌశల్ తాజా పోస్ట్ ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది. కౌశల్ తన భార్య నీలిమకు ఆరోగ్యం సరిగాలేదన్నట్లు ఆ పోస్ట్ లో పరోక్షంగా తెలియజేశాడు.

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సుపరిచితమే. హౌస్ లో ఉండగా తన కోసం బయట ప్రత్యేక ఆర్మీని సిద్ధం చేశాడు. హౌస్ లో ఎమోషన్స్, రిలేషన్స్ కి దూరంగా ఉంటూ, గేమ్ ని గేమ్ లా ఆడి టైటిల్ గెలుచుకున్నాడు కౌశల్. ఫైనల్ లో సింగర్ గీతా మాధురితో కౌశల్ పోటీపడి టైటిల్ అందుకోవడం జరిగింది. అనేక సినిమాలు, సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా రాబట్టాడు కౌశల్. 

కాగా కౌశల్ తాజా పోస్ట్ ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది. కౌశల్ తన భార్య నీలిమకు ఆరోగ్యం సరిగాలేదన్నట్లు ఆ పోస్ట్ లో పరోక్షంగా తెలియజేశాడు. 'ఏవో సాధించాలని నీ ప్రయాణం మొదలుపెట్టావు. ఏదో ఒకటి సాధించాలని జీవిత పోరాటం చేస్తున్నావ్. నీకున్న ధైర్యంతో ఏదో ఒకటి సాధించగలవని నాకు తెలుసు. నీ కలల కోసం త్వరగా కోలుకొని తిరిగిరా' అంటూ తనభార్యతో పాటు ఉన్న వీడియో పోస్ట్ చేశాడు. 


కోలుకొని తిరిగి రావాలని భార్యని ఉద్దేశించి కౌశల్ మాట్లాడడం ఆయన ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది. గతంలో విశాల్ తన భార్యకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చెప్పారు. దీనితో కౌశల్ భార్య నీలిమకు ఏమైందో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఏమైందో చెప్పాలి అంటూ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌