
పవర్ స్టార్ పవన్ కల‍్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే మూడు పాటలు విడుదల చేశారు.
ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్ కూడా విడుదలైంది. ‘అడవి తల్లి’ (Aadavi thalli song) అనే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్ట్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ‘కిందున్న మడుసులకా పోపాలు తెమలవు.. పైనున్న సామేమో కిమ్మని పలకడు... దూకేటి కత్తులా కనికరమెరగవు.. అంటుకున్న అగ్గిలోన ఆనవాళ్లు మిగలవు..’అంటూ సాగా ఈ ‘అడవి తల్లి మాట’పాటకు రామజోగయ్యశాస్త్రీ లిరిక్స్ అందించగా, కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ పాట పాడిన సింగర్ గురించి వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. కుమ్మరి దుర్గవ్వ ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ (Durgavva) భర్త రాజయ్య చాలా ఏళ్ల క్రితమే మరణించాడు. దుర్గవ్వకు కుమార్తె శైలజ, కుమారుడు ప్రభాకర్ ఉన్నారు. నిరుపేద కావడంతో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేది. వరినాట్లు, పొలం పనులకు వెళ్లినప్పుడు దుర్గవ్వ తనకు వచ్చిన జానపద పాటలు పాడేది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న ఆమె కుమార్తె శైలజ తల్లితో పాటలు పాడిస్తూ యూట్యూబ్ అప్‌లోడ్ చేసేది. ఇలా దుర్గవ్వ పాడిన పాటలు హిట్ కావడంతో మంచిర్యాలకు చెందిన పలువురు జానపద కళాకారులు తమ ఆల్బమ్‌లలో పాటలు పాడించారు. ఆ పాటలు కూడా పాపులర్ కావడంతో మల్లిక్‌తేజ, మామిడి మౌనిక వంటి జానపద కళాకారులు దుర్గవ్వ కళను గుర్తించి అవకాశం ఇచ్చారు.
Also read Adavi Thalli Maata: ఫోక్ బీట్ లో సాగిన మాస్ సాంగ్... అలరిస్తున్న భీమ్లా నాయక్ కొత్త పాట
సిరిసిల్ల చిన్నది.. నాయితల్లే.. అనే పాటతో పాటు ‘ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది. మామిడి మౌనిక, సింగర్ మల్లిక్‌తేజ సహకారంతో టాలీవుడ్ స్టార్‌హీరో సినిమాలో పాడే అవకాశం వచ్చిందని దుర్గవ్వ కుమార్తె శైలజ తెలిపారు. ‘అమ్మకు సినిమాలో పాడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని’ శైలజ ‘ ప్రత్యేకంగా తెలిపారు. ప్రస్తుతం దుర్గవ్వ హైదరాబాద్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
Also read Chiranjeevi: మీడియా నన్ను బద్నామ్ చేసింది... ఆ మూడు ఛానల్స్ కి చిరంజీవి చురకలు