కమల్ హాసన్ పై తమిళనాడు సర్కార్ ఆగ్రహం, నోటీసులు జారీ.. బాధ్యత లేకుండా..

pratap reddy   | Asianet News
Published : Dec 06, 2021, 01:24 PM IST
కమల్ హాసన్ పై తమిళనాడు సర్కార్ ఆగ్రహం, నోటీసులు జారీ.. బాధ్యత లేకుండా..

సారాంశం

లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన కమల్ హాసన్ అమెరికాకు వెళ్లి తన సొంత దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించారు. 

లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన కమల్ హాసన్ అమెరికాకు వెళ్లి తన సొంత దుస్తుల బ్రాండ్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం ముగించుకుని ఇండియాకు వచ్చిన తర్వాత కమల్ హాసన్ లో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. 

దీనితో కమల్ హాసన్ కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కమల్ కి కోవిడ్ అని తేలగానే అభిమానులంతా కంగారు పడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కమల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. దీనితో త్వరగానే కమల్ హాసన్ కోలుకున్నారు. 

ఇటీవలే కమల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కమల్ కోవిడ్ నుంచి కోలుకునే వరకు రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించారు. కరోనా నుంచి కోలుకోవడంతో కమల్ హాసన్ తిరిగి బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇది కాస్త వివాదంగా మారింది. 

కరోనాకి గురైన వాళ్ళు కొంతకాలం క్వారంటైన్ లో ఉండాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తల కోసం క్వారంటైన్ లో ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ కమల్ మాత్రం ఆసుపత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ అయ్యారో లేదో.. అలా బిగ్ బాస్ షోకి హాజరయ్యారు. దీనితో తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ కమల్ కి నోటీసులు జారీ చేసింది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారి బాధ్యతగా వ్యవహరించాలి. కనీస బాధ్యత లేకుండా కోవిడ్ నిబంధనల్ని తుంగలో తొక్కితే ఎలా ని తమిళనాడు ప్రభుత్వం కమల్ హాసన్ ని ప్రశ్నించింది. మరి దీనిపై కమల్ హాసన్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. 

Also Read: ఇంటర్నెట్ లో జాన్వీ కపూర్ తుఫాన్.. క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిన శ్రీదేవి కుమార్తె

Also Read: RRR Movie: రక్తపు మరకలు, ఉక్కు కండలతో ఎన్టీఆర్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌