ఈ శుక్రవారం ఓటీటీ ప్రేక్షకులకు పండగనే చెప్పాలి. ఎప్పుడూ లేనివిధంగా ఓకేరోజు ఏకంగా 22 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఆ చిత్రాలేంటి? ఎక్కడ చూడొచ్చనే వివరాలు తెలుసుకుందాం.
ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తూ అలరిస్తున్నాయి. ఈసారి మాత్రం థియేటర్లలో కన్నా ఓటీటీలోనే సందడి ఎక్కువగా ఉండబోతోందని చెప్పాలి. ప్రస్తుతం థియేటర్లలో ‘ఆదిపురుష్’ ఒక్కటే పెద్ద సినిమాగా ఉంది. ఈ మూవీ జోరు కూడా తగ్గినట్టే కనిపిస్తోంది. దీంతో ప్రేక్షకులకు నెక్ట్స్ సినిమాలేంటని చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 28 సినిమాలు ఆయా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ల్లో విడుదల కానున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ లో.... నాలుగు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అవి : టీకూ వెడ్స్ షేర్ (హిందీ), పొన్నియిన్ సెల్వన్ (హిందీలో), జాన్ విక్ 4 (ఇంగ్లీష్), కళువెత్తి మూర్కన్ (తమిళం).
నెట్ ఫ్లిక్స్ లో.... ఆరు సినిమాలు స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు రానున్నాయి.... అవి : ద పర్ఫెక్ట్స్ ఫైండ్ (ఇంగ్లీష్), ఐ నంబర్ : జోజీ గోల్డ్ (ఇంగ్లీష్), త్రూ మై విండో (ఇంగ్లీష్), క్యాచింగ్ కిల్లర్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ డ్యా.), త్రిశంకు ( మలయాళం), తీర కాదల్ (తమిళం).
ఆహాలో... తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న నరేష్ -పవిత్రల ‘మళ్లీ పెళ్లి’ స్ట్రీమింగ్ కాబోతోంది. అలాగే ‘ఇంటింటి రామాయణం’, తమిళ చిత్రం ’జాన్ లూథర్‘ స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ5లో... సెన్సేషనల్ మూవీ ‘ది కేరళ స్టోరీ (తెలుగు వెర్షన్), సల్మాన్ ఖాన్ నటించిన ’కిసి కీ బాయ్ కిసి కా జాన్ (హిందీ) స్ట్రీమింగ్ కానున్నాయి.
సోనీ లివ్ లో.... అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’తో పాటు హిందీ సిరీస్ ‘కఫాస్’ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ : కేరళ క్రైమ్ ఫైల్స్ (తెలుగు వెర్షన్), జాగ్డ్ మైండ్ (ఇంగ్లీష్), వరల్డ్స్ బెస్ట్ (ఇంగ్లీష్)
జియో సినిమాలో : అసెక్ (హిందీ మూవీ)
అడ్డా టైమ్స్ : బెంగాలీ మూవీ ‘ఫ్లై ఓవర్‘
ఇక థియేటర్లలోకి మొత్తం తొమ్మిది చిన్న సినిమాలు రాబోతున్నాయి.