అఫీషియల్ అప్డేట్.. మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీజర్ కు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

By Asianet News  |  First Published Jun 22, 2023, 5:09 PM IST

మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. చిరు నటిస్తున్న ‘భోళా శంకర్’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. 
 


మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar).  మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చివరిగా చిరు ‘వాల్తేరు వీరయ్య’తో భారీ హిట్ ను అందుకోవడం.. ‘భోళా శంకర్’లో నయా లుక్ తో రాబోతుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్  ఆల్మోస్ట్ పూర్తైంది. కొద్దిపాటి చిత్రీకరణను రోజుల్లోనే ముగించబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. సినిమాను ప్రమోట్ చేసే పనిలో యూనిట్ నిమగ్నమైంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ హైప్ పెంచేస్తున్నారు. ఇప్పటికే  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్  ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అభిమానులు ఎదురుచూస్తున్న పవర్ ఫుల్ టీజర్ పైన మేకర్స్ అఫీషియల్ అప్డేట్ అందించారు. 

Latest Videos

’భోళా శంకర్’ టీజర్ సిద్ధమైంది. మెగా అభిమానులు, ఆడియెన్స్  మెగా సెలబ్రేషన్స్ కు సిద్ధంగా ఉండండి. మునుపెన్నడూ లేనివిధంగా ఉండబోతోంది. జూన్ 24న ఎలక్ట్రిఫైయింగ్ భోళా శంకర్ టీజర్ విడుదల కాబోతోందంటూ మేకర్స్ అప్డేట్ అందించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మెగా స్టార్ వింటేజ్ లుక్ తో రాబోతున్న ఈచిత్రం ఫ్యాన్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుందని ఆశిస్తున్నారు. 

ఇక చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్  బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ హీరోయిన్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) చిరు సరసన నటిస్తోంది. కీర్తి సురేష్ చెల్లెలిగా అలరించబోతోంది. బుల్లితెర యాక్ట్రెస్ లు కూడా కనిపించబోతున్నారు. సాగర్ మహతీ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

Get ready for an explosion of excitement and a MEGA CELEBRATION like never before 💥

The electrifying Teaser on June 24th🔥

Mega🌟 … pic.twitter.com/rEK2ogkBH5

— AK Entertainments (@AKentsOfficial)
click me!