Lala bheemla lyrical:తగ్గేదేలే... ఆర్ ఆర్ ఆర్ కి ఎదురే... క్లారిటీ ఇచ్చిన భీమ్లా నాయక్

Published : Nov 03, 2021, 12:14 PM ISTUpdated : Nov 03, 2021, 12:30 PM IST
Lala bheemla lyrical:తగ్గేదేలే... ఆర్ ఆర్ ఆర్ కి ఎదురే... క్లారిటీ ఇచ్చిన భీమ్లా నాయక్

సారాంశం

లాలా భీమ్లా ప్రోమో రిలీజ్ ప్రకటన పోస్టర్ లో విడుదల తేదీగా జనవరి 12 ముద్రించారు. రెండు రోజులుగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల ఫిబ్రవరి లేదా మార్చ్ కి మార్చుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.

భీమ్లా నాయక్ నుండి దివాళి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ సాంగ్ లాలా భీమ్లా లిరికల్ వీడియో పండగ రోజు దిగనుంది. కాగా నేడు Lala bheemla... లిరికల్ పోమో విడుదల కానుంది. సాయంత్రం 7:02 నిమిషాలకు ప్రోమో లాంచ్ కానుంది. ఫ్యాన్స్ ఎప్పటి నుండో లాలా భీమ్లా సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లిరికల్ గా ఈ సాంగ్ విడుదల అవుతుందని అందరూ భావించారు. వేరే సాంగ్ రిలీజ్ కావడం ఫ్యాన్స్ ని ఒకింత నిరాశకు గురిచేసింది. దీపావళి కానుకగా టైటిల్ సాంగ్ విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నిపించింది. 


ఇక ప్రకటన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గెటప్ సైతం ఆసక్తి రేపుతోంది. లుంగీ కట్టుకొని కూర్చొని ఉన్న Pawan kalyan ఎదుట ఫుల్ బాటిల్, నాటు టపాసులు ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ లో ఓ కీలక అంశంపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చారు. ప్రచారం జరుగుతున్నట్లు భీమ్లా నాయక్ విడుదల పోస్ట్ ఫోన్ చేయడం లేదని తెలియజేశారు. 


లాలా భీమ్లా ప్రోమో రిలీజ్ ప్రకటన పోస్టర్ లో విడుదల తేదీగా జనవరి 12 ముద్రించారు. రెండు రోజులుగా ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ విడుదల ఫిబ్రవరి లేదా మార్చ్ కి మార్చుకున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఆ వార్తలలో నిజం లేదని, చెప్పిన ప్రకారం సంక్రాంతి బరిలో Bheemla nayak దిగుతున్నట్లు నేటి ప్రకటనతో క్లారిటీ వచ్చింది. 
ఇది పవన్ ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పాలి. 

ఇక భీమ్లా నాయక్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రెండు పాటలు వెలువడ్డాయి. లాలా భీమ్లా మూడవ లిరికల్. ఈ సాంగ్ దుమ్ము రేగిపోవాలంటూ థమన్ కి ఫ్యాన్స్ నుండి డిమాండ్ ఉంది. 
ఇక మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి భీమ్లా నాయక్ అధికారిక రీమేక్. 

Also read పవన్‌ కళ్యాణ్‌ సడెన్‌ సర్‌ప్రైజ్‌.. `భీమ్లా నాయక్‌` నుంచి దీపావళి క్రేజీ అప్‌డేట్‌

ఈ చిత్రంలో హీరో రానా కీలక రోల్ చేస్తున్నారు. పవన్, రానా మధ్య నడిచే ఆధిపత్య పోరునే, భీమ్లా నాయక్ చిత్రం. పవన్ పోలీస్ రోల్ చేస్తుండగా, Rana daggubati ఆర్మీ అధికారిగా కనిపించాడనున్నాడు. పవన్ కి జంటగా నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్క్రీన్ ప్లే మాటలు త్రివిక్రమ్ సమకూర్చారు. 

Aslo read Rajamouli: రాజమౌళి అనుభవించిన దుర్భర పరిస్థితులు... అందుకే దానాలకు దూరమా!
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్