నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లిన దొంగ

Published : Nov 15, 2021, 08:03 AM ISTUpdated : Nov 15, 2021, 09:12 AM IST
నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లిన దొంగ

సారాంశం

నటిపై దాడి చేసి మొబైల్ లాక్కెళ్లడం సంచలనంగా మారింది. ఈ దాడిలో సదరు నటికి గాయాలు కాగా, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 

హైదరాబాద్ నగరంలో దొంగల ఆగడాలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు పర్స్ లు, బంగారు ఆభరణాలు వాళ్ళ టార్గెట్ గా ఉండేవి. డిజిటల్ చెల్లింపులు ఎక్కువయ్యాక డబ్బులు క్యారీ చేయడం అరుదుగా మారింది. దీనితో దొంగల టార్గెట్ మొబైల్స్ వైపు మళ్లింది. ప్రతి ఒక్కరి వద్ద ఉండే ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ దొంగిలించడం, స్మగ్లింగ్ మార్కెట్ లో అమ్మివేయడం చేస్తున్నారు. రోజుకు ఒక మొబైల్ దొంగిలించినా, వాళ్ళ జేబులు నిండినట్లే. 


అయితే ఈ దొంగలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. తాజాగా చౌరాసియా అనే నటిపై దాడి చేసి, మొబైల్ లాక్కెళ్లడం సంచలనంగా మారింది. ఉదయాన్నే కేబీఆర్ పార్క్ లో వందల మంది జాగింగ్ చేస్తారు. అలాగే చౌరాసియా పార్క్ కి జాగింగ్ కి వెళ్లడం జరిగింది. ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగుడు, చేతిలో ఉన్న ఆమె మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నటి ప్రతిఘటించడం జరిగింది. దానితో ఆమెను గాయపరిచి మొబైల్ తీసుకొని, అక్కడి నుండి పారిపోయాడు. 

Also read Shilpa shetty: మరో కేసులో బుక్ అయిన రాజ్ కుంద్రా... ఈసారి శిల్పా శెట్టి కూడా
ఈ దాడిలో నటి చౌరాసియా స్వల్ప గాయాలుపాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అనంతరం డైల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ ఆధారంగా దుండగుడు ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Also read Pooja hegde: బికినీలో బ్రేక్ ఫాస్ట్, సముద్రంలో జలకాలు.. మాల్దీవ్స్ తీరాన్ని అందాలతో వేడెక్కిస్తున్న పూజ హెగ్డే
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్