Ghani teaser: గని టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్

Published : Nov 14, 2021, 11:07 PM ISTUpdated : Nov 15, 2021, 11:41 AM IST
Ghani teaser: గని టీజర్ లో చరణ్ వాయిస్ ఓవర్

సారాంశం

 గని చిత్రం కోసం వరుణ్ కఠిన కసరత్తులతో కండల తిరిగి దేహం సాధించాడు. సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.   

కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన జోనర్స్ ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు వరుణ్ తేజ్ (Varun tej). ఆయన గత చిత్రం గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, వరుణ్ నెగిటివ్ షేడ్స్ లో కనిపించడం విశేషం. కాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుణ్ లేటెస్ట్ మూవీ గని లో ఆయన ప్రొఫెషనల్ బాక్సర్ రోల్ చేస్తున్నారు . 


దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. సిద్దు ముద్ద మరో నిర్మాతగా ఉన్నారు. గని(Ghani) చిత్రం కోసం వరుణ్ కఠిన కసరత్తులతో కండల తిరిగి దేహం సాధించాడు. సహజత్వం కోసం వరుణ్ ప్రొఫెషనల్ బాక్సర్స్ వద్ద శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇక విడుదలైన ప్రోమోలు మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. 


రేపు ఉదయం 11:08 నిమిషాలకు గని టీజర్ విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. గని టీజర్ దుమ్ము రేపనుందని తెలుస్తుండగా... ఈ టీజర్ లో హీరో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో సాగడం మరో ఆసక్తికర విషయం. రామ్ చరణ్ (Ram charan) వాయిస్ ఓవర్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణ తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు. 

మరోవైపు స్టార్ క్యాస్ట్ గని చిత్రంలో భాగమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నరేష్, నదియా కీలక రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది గని చిత్రం.
 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్