బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కి రోజుల సమయం మాత్రమే ఉంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఖాయమైంది. ఈసారి హౌస్లో ముగ్గురు కన్నడ భామలు సందడి చేయనున్నారట.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కి కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది. మరో వారం రోజుల్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటలకు స్టార్ మా లో సందడి షురూ చేయనున్నారు. ఇక కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు సెలెబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈసారి ముగ్గురు కన్నడ సీరియల్ హీరోయిన్స్ హౌస్లో అడుగు పెడుతున్నారట. గ్లామర్ ప్రియులకు పండగే అంటున్నారు.
వారిలో ఒకరు తేజస్విని గౌడ అట. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అమర్ దీప్ భార్య అయిన తేజస్విని గౌడ బిగ్ బాస్ షోకి వస్తున్నారట. తేజస్వి గౌడ పలు తెలుగు, కన్నడ సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేసింది. అమర్ దీప్ చౌదరిని ప్రేమ వివాహం చేసుకుంది. గత సీజన్లో అమర్ దీప్ కి కొంచెం లో టైటిల్ చేజారింది. భర్త తేలేకపోయిన టైటిల్ తాను గెలిచేందుకు సిద్దమైందట.
అలాగే జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు బిగ్ బాస్ షోకి ఎంపికైంది అనేది లేటెస్ట్ న్యూస్. సౌమ్యరావు సైతం కన్నడ సీరియల్ నటి. అలాగే యాంకర్ కూడాను. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకున్నాక సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. ఏడాదికి పైగా జబర్దస్త్ షోలో ఆమె కొనసాగారు. సౌమ్యరావు జబర్దస్త్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆమెకు భాష రాకపోవడం కూడా మైనస్ అయ్యింది. జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పిన సౌమ్యరావు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనుందట.
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యాష్మి గౌడ సైతం బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తుందట. ఈమె కూడా కన్నడ సీరియల్ హీరోయిన్ కావడం విశేషం. సౌమ్యరావు, తేజస్వి గౌడ, యాష్మి గౌడ హౌస్లో తమ గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించే అవకాశం కలదు. వీరితో పాటు రీతూ చౌదరి. విష్ణుప్రియ, ఖయ్యూం, అనిల్ గిల్లా, అంజలి పవన్, బంబిక్ బబ్లు, సోనియా సింగ్, మోడల్ ఊర్మిళ చౌహాన్, బెజవాడ బేబక్క, నటుడు అభిరామ్ వర్మ, నటుడు నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని టాలీవుడ్ టాక్.
ఏది ఏమైనా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు టోటల్ కంటెస్టెంట్స్ ఎవరనేది సస్పెన్సు. బిగ్ బాస్ షో రూల్స్ ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ లో మాత్రమే కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తారు. వరుసగా ఆరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున బాధ్యతలు నెరవేర్చనున్నారు. ఈసారి ఆయన భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారని వినికిడి.