పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్.. ప్రపంచ వ్యాప్తం గుర్తింపు సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇష్టమైన సినిమా ఏది..? రామ్ చరణ్ ఇష్టపడే హీరోయిన్ ఎవరో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. వరుస ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ ఫైనల్ షూటింగ్ జరుగుతంది. ఈ ఏడాది ఈసినిమాతో ఫ్యాన్స్ నుఅలరించనున్నాడు రామ్ చరణ్. ఈసినిమా తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్ లోమూవీ ఓపెనింగ్ జరిగిపోయింది. షూటింగ్ లోకి వెళ్ళడమే తరువాయి.
కాగా రామ్ చరణ్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు.. బాగా ఇష్టమైన సినిమా ఏది..? ఈ విషయంలో స్యయంగా క్లారిటీ ఇచ్చారురామ్ చరణ్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? రీసెంట్ గా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూల ఇచ్చారు రామ్ చరణ్. ఈ ఇంటర్వ్యూలో ఆయన రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా తనకు బాగా ఇష్టమైన సినిమా మగధీర అనిచెప్పారు. అంతే కాదు రంగస్థలం, ఆరెంజ్ సినిమాలన్నా కూడా తనకు బాగా ఇష్టమని చెప్పారు.
ఇక మగధీర తన కెరీర్ ను టర్న్ చేసిందని అన్నారు చరణ్. అంతే కాదు ఈసినిమా లాండ్ మార్క్ అని.. అభిమానుల్లో కూడా చాలామందికి ఈ సినిమా అంటేనే ఇష్టం అన్నారు. ఇక రామ్ చరణ్ కు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే..? ఈ తరం హీరోయిన్లలో చరణ్ కు సమంత యాక్టింగ్ అంటే చాలా ఇష్టమట. ఇక హీరోలలో రామ్ చరణ్ కు తమిళ స్టార్ సూర్య నటన అంటే బాగా ఇష్టమని తెలుస్తోంది.
ఇక రామ్ చరణ్ ఇంత వరకూ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు.. కాని కామెడీ ట్రై చేయలేదు. అయితే బుచ్చిబాబుతో చేసే సినిమా కాంమెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. ఈరకంగా తన సినిమాపై ఫ్యాన్స్ కు అదరిపోయే అప్ డేట్ ను ఇవ్వకనే ఇచ్చారు చరణ్. గేమ్ ఛేంజర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక బుచ్చిబాబు సినిమా పై కూడా అంచనాలు పెంచేశాడు చరణ్.