ప్రభాస్ పై బాలీవుడ్ నటుడి కామెంట్స్.. మంచు విష్ణు ఫైర్, ఒక్క మాటతో బుద్ధి చెప్పిన శర్వానంద్

By tirumala AN  |  First Published Aug 23, 2024, 2:40 PM IST

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇటీవల ప్రభాస్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలు ఎలాంటి మాట మాట్లాడినా క్షణాల్లో సిసిఎల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి ఇటీవల ప్రభాస్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలు ఎలాంటి మాట మాట్లాడినా క్షణాల్లో సిసిఎల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాంటిది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తీవ్రమైన పరిణామాలు, ట్రోలింగ్ తప్పడం లేదు. 

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను కల్కి చిత్రం చూశానని అన్నారు. కానీ ప్రభాస్ ని ఒక జోకర్ లాగా చూపించారు. ప్రభాస్ గెటప్ చూసి తాను షాక్ అయినట్లు అర్షద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

Latest Videos

అర్షద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా అతడిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం నెమ్మదిగా అర్షద్ వ్యాఖ్యలని ఖండిస్తున్నారు. 

తాజాగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అధికారికంగా అర్షద్ వ్యాఖ్యలని ఖండిస్తూ లేఖ రాశారు. సినీ టివి ఆర్టిస్ట్ అసోసియోషన్ అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కి మంచు విష్ణు ఈ లేఖ రాశారు. ప్రతి వ్యక్తికి తమ అభిప్రాయాలని చెప్పుకునే హక్కు ఉంది. కానీ ఇతరులని అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. ప్రభాస్ గురించి అర్షద్ చులకనగా మాట్లాడారు. ఆయన మాటలు తెలుగు సినీ వర్గాలు, అభిమానుల మనోభావాలు దెబ్బతీశాయి. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ చేయకుండా చర్యలు తీసుకోవాలని విష్ణు కోరారు. 

ఇదిలా ఉండగా అర్షద్ వ్యాఖ్యలపై హీరో శర్వానంద్ కూడా ఫైర్ అయ్యాడు. శర్వానంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఒక నటుడు.. మరొక నటుడిని ఎప్పుడూ విమర్శించకూడదు. ఇది ప్రాథమికంగా పాటించాల్సిన విలువల్లో ఇది ఒకటి అని శర్వానంద్ పోస్ట్ చేశారు. 

click me!