
‘ది వారియర్’ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తన మేకర్ ఓవర్ ను కూడా అదిరిపోయేలా మార్చేశాడు. మరోవైపు ఇస్మార్ శంకర్ సినిమా తర్వాత రామ్ పోతినేని తన అప్ కమింగ్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరిగా ‘రెడ్’ మూవీతో కొంత నిరాశ పర్చిన రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో The Warriorలో నటిస్తున్నారు. రామ్ సరసన యంగ్ హీరోయిన్ కృతి శెట్టి (Kriti Shetty) ఆడిపాడనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘బుల్లెట్’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఎనర్జిటిక్ బుల్లెట్ సాంగ్ కు దేవీ శ్రీ ప్రసాద్ క్యాచీ టూన్ అందించగా.. తమిళ యాక్టర్ శింబు (Simbu), హరిప్రియ అద్భుతంగా పాడారు. శ్రీ మణి ఈ సాంగ్ కు అదిరిపోయే లిరిక్స్ అందించారు. ‘కమన్ బేబీ లేట్స్ గో ఆన్ ద బుల్లెట్.. ఆన్ ద వే లో పాడుకుందాం డూయేట్టు’ అంటూ సాగే పాట ఆసాంతం వినసొంపుగా, రామ్ పోతినేని అభిమానుల్లో జోష్ నింపేలా ఉంది. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతోందీ సాంగ్.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయ. ప్రస్తుతం విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎనర్జిటిక్ బుల్లెట్ సాంగ్ కూడా దూసుకుపోతోంది. తొలిసారి రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండటంతో ఇస్మార్ట్ శంకర్ పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో అదే స్థాయి హైప్ కొనసాగుతోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు.