Ravi Teja Dhamaka: మాస్ మహారాజ్ క్రేజీ అప్ డేట్.. ధమాకా షెడ్యూల్ కు ప్లాన్ చేసుకుంటున్న రవితేజ

Published : Apr 22, 2022, 05:13 PM IST
Ravi Teja Dhamaka: మాస్ మహారాజ్ క్రేజీ  అప్ డేట్.. ధమాకా షెడ్యూల్ కు ప్లాన్ చేసుకుంటున్న రవితేజ

సారాంశం

మాస్ మహారాజ్ రవితేజ తగ్గేదే లే అంటున్నాడు. వరుసగా సినిముల సెట్స్ ఎక్కిస్తున్న రవితేజ.. షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నాడు. త్వరలో ధమాకా షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నాడు మాస్ హీరో.   

మాస్ మహారాజ్ రవితేజ తగ్గేదే లే అంటున్నాడు. వరుసగా సినిముల సెట్స్ ఎక్కిస్తున్న రవితేజ.. షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటున్నాడు. త్వరలో ధమాకా షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్నాడు మాస్ హీరో. 

క్రేజీ హీరో  ర‌వితేజ న‌టిస్తోన్న తాజా ప్రాజెక్టుల్లో ఒక‌టి ధ‌మాకా.  త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా లో  పెళ్లి సంద‌D ఫేం శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ సినిమా గురించి కొత్త అప్ డేట్ ఒకటి వచ్చింది. యాక్ష‌న్ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ధ‌మాకా కొత్త షెడ్యూల్ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లో స్టార్ట్ కాబోతోంది.  ఏప్రిల్ 25 నుంచి న్యూ షెడ్యూల్  స్టార్ట్ కాబోతున్నట్టు సమాచారం.
 
ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ క‌థ,స్క్రీన్ ప్లే, సంభాష‌ణలు అందిస్తున్న ధమాకా మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ల‌పై అభిషేక్ అగర్వాల్‌, వివేక్ కూచిబొల్లు సంయుక్తంగా భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.  ఇప్ప‌టికే ధ‌మాకాలో అద్భుతమైన  ఫైట్‌ సీన్లను రామ్-ల‌క్ష్మ‌ణ్ ఆద్వర్యంలో షూట్ చేశారు. 

ఇక ధమాకాతోపాటు ర‌వితేజ  శ‌ర‌త్ మండ‌వ డైరెక్ష‌న్‌లో రామారావు ఆన్ డ్యూటీ , సుధీర్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రావ‌ణాసుర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. మ‌రోవైపు పాన్ ఇండియా ప్రాజెక్టు టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు కూడా చేస్తున్నాడు. వీటితో పాటు మెగాస్టార్ సినిమాలో కూడా మాస్ మహారాజ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక  ర‌వితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బాక్సాపీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే