Allu Arjun Tweet : ‘కేజీఎఫ్ 2’ చూశాక అల్లు అర్జున్ రియాక్షన్.. యష్, ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం..

Published : Apr 22, 2022, 05:38 PM IST
Allu Arjun Tweet : ‘కేజీఎఫ్ 2’ చూశాక అల్లు అర్జున్ రియాక్షన్.. యష్, ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం..

సారాంశం

కన్నడ సినిమా సత్తా చాటిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 (Kgf Chapter 2) పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. కేజీఎఫ్2 మూవీని చూశాక బన్నీ రియాక్షన్ మామూలుగా లేదు. యష్, ప్రశాంత్ నీల్ ను పొగడ్తలతో ముంచెత్తాడు.  

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, మోస్ట్ అవెయిటెడ్ చిత్రంగా నిలిచి, బ్లాక్ బాస్టర్ హిట్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కేజీఎఫ్ ఛాప్టర్ 2. ఈ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ (Yash) రాఖీ బాయ్ గా నటించి ఇండియా మొత్తంగా ఆడియెన్స్ తో శభాష్ అనిపించుకున్నాడు. తన అద్భుతమైన నటన, అటీట్యూడ్ తో వందకు  వందశాతం మార్కులు పొందాడు యష్. అయితే ఈ చిత్రంపై ఇటు ఆడియెన్స్ నుంచే కాకుండా స్టార్ హీరోల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. సినిమా చూశాక స్పందించకుండా ఉండలేకపోతున్నారు.  

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కేజీఎఫ్ 2 చిత్రంపై స్పందించారు. తన రెస్పాన్స్ తెలియజేస్తూ.. ‘కేజీఎఫ్ 2 టీంకి ముందుగా పెద్దఎత్తున అభినందనలు. యష్ నటన అద్భుతంగానూ,  ఇంటెన్సిటీతో కూడి ఉంది. సంజయ్ దత్ (Sanjay Dutt), రవీనా టండన్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాగ్నాటిక్ ప్రజెన్స్ తో అదరగొట్టారు. మిగితా నటీనటులు కూడా బాగా చేశారు. అత్యుత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు అద్భుతమైన విజువల్స్ ను చూపించిన రవి బస్రూర్, భువనగౌడకు నా అభినందనలు.

అలాగే అద్భుతమైన మాస్ డైరెక్షన్ తో అదరగొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కి స్పెషల్ రెస్పెక్ట్ తెలియజేస్తున్నాను. ఆయన విజన్, కన్విక్షన్ ను గౌరవిస్తున్నాను. సినిమాటిక్ అనుభూతిని అందించినందుకు అందికీ ధన్యవాదాలు. అలాగే భారతీయ సినిమా పతాకాన్ని ఆకాశానికి ఎగురవేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.’ అంటూ ట్వీట్ చేశారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2పై బన్సీ ప్రశంసల వర్షం కురిపించడం నెట్టింట విశేషంగా మారింది.

ఇప్పటికే బన్నీ పుష్ప : ది రైజ్ (Pusha : The Rise) సినిమాతో తెలుగు సినిమాను సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటవా మావా’తో వరల్డ్ వైడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. మరోవైపు అల్లు అర్జున్ మేనరిజం ప్రతి ఆడియెన్ నరాల్లోకి ఎక్కేసింది. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 (Pushpa : The Rule) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?