#Hanuman హాలీవుడ్ లోనూ 'హనుమాన్' కాన్సెప్ట్ తో సినిమా

By Surya Prakash  |  First Published Jan 27, 2024, 2:52 PM IST

బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడి ఫోటోలు కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు.



ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హనుమాన్ మూవీ తరహాలోనే హాలీవుడ్ నుంచి ఓ సినిమా రానుంది.  ఆ సినిమా పేరే ‘మంకీ మ్యాన్’. ఈ విషయం తాజాగా రిలీజైన సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ దేవ్ పటేల్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది.   మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్. ఈ మూవీతో శోభితా దూళిపాల హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

మంకీ మ్యాన్ మూవీతో డైరెక్టర్‌గా మారాడు దేవ్ పటేల్. స్లమ్ డాగ్ మిలియనీర్, లయన్, ది మ్యాన్ వూ నో ఇన్ఫినిటీ, హోటల్ ముంబై, ది గ్రీన్ నైట్ వంటి హాలీవుడ్ అండ్ బాలీవుడ్ చిత్రాలతో చాలా పాపులర్ అయ్యాడు దేవ్ పటేల్. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నాడు. ‘‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

Latest Videos

 అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడి ఫోటోలు కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ’’ అని ‘మంకీ మ్యాన్’ సారాంశాన్ని ఒక డైలాగుతో చెప్పేశాడు హీరో. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అలాంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేస్తానని దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. అదంతా తాను ఎలా చేస్తాడు అనేదే అసలు కథ అని ట్రైలర్‌లో స్పష్టం చేశారు మేకర్స్.

మంకీ మ్యాన్ మూవీలో దేవ్ పటేల్, శోభితా ధూలిపాళతోపాటు మకరంద్ దేశ్ పాండే, సికందర్ ఖేర్, షార్లోటో కోప్లే, పిటోబాష్, విపిన్ శర్మ, అదితి కల్కుంటె, అశ్విని కల్సేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరిలో మకరంద్ దేశ్ పాండే గురూజీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. మంకీ మ్యాన్ సినిమాను దేవ్ పటేల్‌తో పాటు జోమోన్ థామస్, జోర్డాన్ పీలే, విన్ రోసెన్ఫెల్డ్, ఇయాన్ కూపర్, బాసిల్ ఇవానిక్, ఎరికా లీ, క్రిస్టీన్ హేబ్లర్, అంజయ్ నాగ్పాల్ నిర్మిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా జోనాథన్ ఫుహ్ర్మాన్, నటాలియా పావ్చిన్స్‌క్యా, ఆరోన్ ఎల్ గిల్బర్ట్, ఆండ్రియా స్ప్రింగ్, అలిసన్-జేన్ రోనీ, స్టీవెన్ థిబాల్ట్ వ్యవహరిస్తున్నారు. మంకీ మ్యాన్ మూవీని ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక మంకీ మ్యాన్ ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
 

click me!