శెలవు రోజున కూడా అంత తక్కువ రావటం ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ కలగ చేయలకపోయిందనే చెప్పాలి.
తమిళంలో ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ ఆ టైమ్ లో తెలుగులో పోటీ ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా విడుదల కాలేదు. కాస్త లేటుగా ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ధనుష్, సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్.. వంటి స్టార్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ధనుష్ వన్ మ్యాన్ షో ఇది. మూడు గెటప్పుల్లో కనిపించి అలరిస్తారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు కూడా అదుర్స్ అనిపిస్తాయి. ధనుష్ గత చిత్రాలు గుర్తు చేసేలా ఆయన పాత్ర తీరుతెన్నులు ఉంటాయి. దాంతో ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ వస్తాయని భావించారు. కానీ #CaptainMiller తెలుగులో ఓపినింగ్స్ తెచ్చుకునే విషయంలో ఫెయిలైందనే చెప్పాలి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... #CaptainMillerTelugu కు కేవలం ₹1 Cr గ్రాస్ మాత్రమే వచ్చింది. శెలవు రోజున కూడా అంత తక్కువ రావటం ట్రేడ్ కు షాక్ ఇచ్చింది. తెలుగులో ఈ సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ కలగ చేయలకపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో రేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గించి పోస్టర్ వదిలారు. మరి ఈ రేట్లు తగ్గింపు ఏ మేరకు ఇంపాక్ట్ చూపెడుతుందో చూడాలి.
అరుణ్ మాథేశ్వరన్ దర్శతక్వం వచ్చిన ఈ చిత్రం.. ధనుష్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. బ్రిటిష్ ఇండియా కాలంలో జరిగే తిరుగుబాటు కథతో ఈ సినిమా రూపొందింది. బ్రిటిష్ పాలనా కాలంలోకి తీసుకెళ్లిన కథ ఇది. అప్పట్లో మన గ్రామాలు, సమాజంలోని అసమానతల్ని కళ్లకు కడుతుంది. వివక్షకు గురైన ఓ యువకుడి ప్రయాణాన్ని పలు పార్శ్వాల్లో తెరపై చూపించారు. నాటి పరిస్థితుల్ని కళ్లకు కట్టడంలో దర్శకుడు ప్రభావం చూపించాడే కానీ.. కథాంశంతో గానీ, పాత్రతో గానీ బలమైన భావోద్వేగాల్ని ఆవిష్కరించలేకపోయాడు. దాంతో నిస్సారమైన సన్నివేశాల్ని తెరపై చూస్తున్న అనుభవం కలుగుతుంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించటం ప్లస్ పాయింట్ అవుతోంది.