Kick Re Release Date : రవితేజ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. రీరిలీజ్ కు ‘కిక్’ మూవీ రెడీ!

By Nuthi Srikanth  |  First Published Jan 27, 2024, 12:54 PM IST

మాస్ మహారాజా ఫ్యాన్స్ రవితేజ RaviTeja నెక్ట్స్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందింది. మాస్ రాజా సూపర్ హిట్ ఫిల్మ్ రీరిలీజ్ కాబోతోంది. 
 


మాస్ మహారాజా అభిమానులు సంక్రాంతి కానుకగా రవితేజ నుంచి సినిమాను ఆశించారు. అనుకున్నట్టుగా ఫ్యాన్స్ ను అలరించేందుకు యాక్షన్ ఫిల్మ్ ‘ఈగల్’ Eagle ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. కానీ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటం.. థియేటర్ల కొరత ఏర్పడటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. మేకర్స్ ను నిర్మాత మండలి కాంప్రమైజ్ చేసి సోలో డేట్ ను ఇచ్చింది. 

దీంతో ‘ఈగల్’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు మళ్లీ ప్రకటించారు. ఈ క్రమంలో సినిమాను ఎంజాయ్ చేసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు మరో కిక్కిచ్చే వార్త అందింది. రవితేజ కెరీర్ లో బెస్ట్ చిత్రాల్లో ఒకటైన ‘కిక్’ Kick Movie మళ్లీ థియేటర్లలోకి రాబోతుండటం విశేషంగా మారింది. కొన్నాళ్లుగా టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Latest Videos

తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో సూపర్ హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న రవితేజ పుట్టిన రోజు జరిగిన విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఆయనకు బెస్ట్ విషెస్ తెలిపారు. రవితేజ కూడా ‘థ్యాంక్యూ తమ్ముళ్లూ’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఆయన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో భాగంగానే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ‘కిక్’ను రీరిలీజ్ చేయబోతున్నారు. మార్చి 1న ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. 

ఇక రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.మాస్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేనితో RT4GM, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.త్వరలో ‘ఈగల్’ మూవీ థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరో అయినప్పటికి  యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. 

 

click me!