The Story of a Beautiful Girl Review: `ది స్టోరీ ఆఫ్‌ ఏ బ్యూటీఫుల్‌ గర్ల్` మూవీ రివ్యూ

By Aithagoni Raju  |  First Published May 12, 2023, 7:50 AM IST

ఛార్మితో `మంత్ర`, అనుపమా పరమేశ్వరన్‌తో `బట్టర్‌ ఫ్లై` వంటి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలను తీస్తూ ఆకట్టుకుంటుంది జెన్‌ నెక్ట్స్ ప్రొడక్షన్‌. ఇప్పుడు `ఏ స్టోరీ ఆఫ్‌ ఏ బ్యూటిఫుల్ గర్ల్` సినిమాని రూపొందించింది. రవి ప్రకాష్‌ బోడపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు(మే 12) శుక్రవారం విడుదలైంది.సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 


ఛార్మితో `మంత్ర`, అనుపమా పరమేశ్వరన్‌తో `బట్టర్‌ ఫ్లై` వంటి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలను తీస్తూ ఆకట్టుకుంటుంది జెన్‌ నెక్ట్స్ ప్రొడక్షన్‌. ఇప్పుడు అలాంటి కంటెంట్‌తోనే `ఏ స్టోరీ ఆఫ్‌ ఏ బ్యూటిఫుల్ గర్ల్` సినిమాని రూపొందించింది. రవి ప్రకాష్‌ బోడపాటి దర్శకత్వంలో ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు సంయుక్తంగా నిర్మించారు. యంగ్‌ హీరో నిహాల్‌ కోదాటి, దృషికా చందర్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. మధునందన్‌, భార్గవ పోలుదాసు, జర్నలిస్ట్ దేవి నాగవల్లి ఇతర కీలక పాత్రలు పోషించారు. నేడు(మే 12) శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథః

Latest Videos

undefined

వాయిస్‌ ఆర్టిస్ట్, డాన్సర్‌ చరిత్ర(దృషికా చందర్‌) మిస్సింగ్‌ కేసుతో సినిమా ప్రారంభమవుతుంది. చరిత్ర మిస్సింగ్‌ అనే వార్త విని రవి(నిహాల్‌ కోదాటి) టెన్షన్‌ పడుతుంటాడు. మరోవైపు ఆర్బన్‌ క్రైమ్‌ సీఐ బాషా(మధునందన్‌) ఈ కేసుని స్థానికంగా ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. కేసు పెద్దది కావడంతో ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ ఆదిత్య ఐపీఎస్‌ (భార్గవ పోలుదాసు) రంగంలోకి దిగుతాడు. ఆయన సారథ్యంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభమవుతుంది. చరిత్ర మిస్సింగ్‌కి సంబంధించి క్లూస్‌ రాబట్టే క్రమంలో ఆమెతో టచ్‌లో ఉన్న వారిని విచారిస్తుంటారు పోలీసులు. అందులో భాగంగా కార్పొరేట్‌ కంపెనీ హెడ్‌ విక్రమ్‌(సమర్థ్‌ యుగ్‌)ని మొదటగా విచారిస్తాడు. అతను చరిత్రతో డేట్‌కి వెళ్లినట్టు చెబుతాడు, అంతకు మించి ఆమెతో సంబంధం లేదని చెప్పి, తర్వాత పోలీసులకు టైమ్‌ ఇవ్వకుండా ఎస్కేప్‌ అవుతుంటాడు. మరోవైపు చరిత్రతో క్లోజ్‌గా ఉన్న రవిని విచారించగా, తమ మధ్య ఉన్న లవ్ స్టోరీ బయటపెడతాడు. రవిని ప్రేమించిన చరిత్ర, కార్పొరేట్‌ కంపెనీ సీఇఓ విక్రమ్‌తో డేట్‌కి ఎందుకు వెళ్లింది? చరిత్ర మిస్సింగ్‌కి ముందు రోజు ఏం జరిగింది? విక్రమ్‌ లోని రెండో కోణం ఏంటి? మిస్‌ అయిన చరిత్ర ప్రాణాలతోనే ఉందా? మరణించిందా? ఈ కేసులో బయటపడ్డ కొత్త కోణాలేంటి? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణః

మిస్టరీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. యదార్థ సంఘటన ఆధానంగా రూపొందించిన చిత్రం అని యూనిట్‌ వెల్లడించింది. ఈ సినిమా మిస్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో బ్లాక్‌ మెయిలింగ్‌ మాఫియాని బయటపెడుతుంది. అమ్మాయిలను బ్లాక్‌ మెయిల్ చేసి డబ్బులు లాగడం అనేది కార్పొరేట్‌ స్టయిల్‌లో కోట్లల్లో, పెద్ద మాఫియాలా జరుగుతుందనే విషయాన్ని ఇందులో చూపించారు. బలమైన కంటెంట్‌తో రూపొందించిన చిత్రమిది. దర్శకుడు రవి ప్రకాష్‌ సినిమా టేకింగ్‌, కంటెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన పడిన కష్టం కనిపిస్తుంది. అంతే కాదు సినిమాని కూడా అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సినిమాలో అన్ని అంశాలు జోడించారు. సస్పెన్స్ ని నెమ్మదిగా పెంచుతూ వెళ్లాడు. మధ్య మధ్యలో థ్రిల్లింగ్‌ పాయింట్‌లను లీక్‌ చేస్తూ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశాడు. చరిత్ర మిస్సింగ్‌కి కారణం రవినా, విక్రమా? అనేది ఊహించే సన్నివేశాల్లో ఆడియెన్స్ ఆలోచనలతో ఓ గేమ్‌ ఆడుకున్నాడు. 

కథనం అనేక మలుపులు తిప్పుతూ ముందుకు తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లాడు. ఇంటర్వెల్‌లో ట్విస్ట్ పెట్టి మరింత హైప్‌ పెంచాడు. కానీ సెకండాఫ్‌లో ఒక్కో అంశం రివీల్‌ చేస్తూ వచ్చాడు. ఈక్రమంలో చాలా వరకు కథ అక్కడక్కడే తిరిగినట్టుగా ఉంది. సస్పెన్స్ ని సినిమా మొత్తం సస్టెయిన్‌ చేయడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. దీనికితోడు సినిమా కూడా స్లోగా సాగుతుంది. జనరల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌ సినిమాలో స్క్రీన్‌ప్లే పరుగులు పెట్టాలి. రేసిగా సాగాలి. ఇందులో దర్శకుడు చాలా కూల్‌గా, తీసుకెళ్లాడు. రేసి సీన్లకి ప్రయారిటీ ఇవ్వలేదు. అందుకే కొంత బోర్‌ ఫీలింగ్ తెపిస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌లోనూ కొంత క్లారిటీ మిస్‌ అయ్యింది. కేసులో క్లూస్‌ దొరక్క ఆఫీసర్లు ఇబ్బందిపడినట్టుగానే సెకండాఫ్‌లో కథనాన్ని ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక తడబడినట్టు అనిపిస్తుంది.

కానీ రవి, చరిత్ర లవ్‌ స్టోరీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్లు కొత్తగా ఉంటాయి. యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంటాయి. మరీ వల్గారిటీ లేదు, కానీ చాలా డీసెంట్‌గానే తీశాడు, వారి ప్రేమలోని ఇంటెన్సిటినీ తెరపై ఆవిష్కరించాడు. ఆయా సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. దీనికితోడు ఎమోషన్స్ సైతం సినిమాకి మరో ప్లస్‌. క్లైమాక్స్ లో వారి ఎమోషన్ సినిమాకి మరో అసెట్‌ అవుతుంది. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ కి పెద్దగా స్కోప్ లేదు. ఇన్వెస్టిగేషన్‌లో కొన్నిసీన్లు అనవసరం అనిపిస్తుంది. సినిమా పరంగా మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. నటీనటులుగానీ, టెక్నీషియన్లుగానీ, బాగా చేశారు. దర్శకుడు నీట్‌గా సినిమాని తీశాడు. స్లో నెరేషన్‌ పక్కన పెడితే తను కథకి జస్టిఫై చేశాడు. మంచి టెక్నీషియన్‌ అని నిరూపించుకున్నాడు. చిన్న చిన్న మైనస్‌లు పక్కనపెడితే కొత్తగా సాగే మంచి ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌ అనే చెప్పొచ్చు. కంటెంట్‌ని నమ్ముకుని చేసిన ప్రయత్నం అభినందనీయం.

నటీనటులుః

రవి పాత్రలో నిహాల్ కోదాటి చాలా బాగా చేశాడు. పేద అబ్బాయిలా పాత్రకి పర్‌ఫెక్ట్ సెట్‌ అయ్యాడు. ఇన్నోసెంట్‌గా, కొన్ని సీన్లలో కన్నింగ్‌గా చాలా బాగా చేశాడు. మరోవైపు చరిత్రగా దృషికా చందర్‌ నటన సినిమాకి మరో హైలైట్‌ అని చెప్పొచ్చు. ఆమె ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. రొమాంటిక్‌ సీన్లలో బాగా చేసింది. ఆడియెన్స్ ని తనతో కనెక్ట్ చేసుకుంది. ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా భార్గవ పోలుదాసు బాగా చేశారు. కాకపోతే ఆయన పాత్రలో కొంత నస ఎక్కువైందనిపిస్తుంది. జర్నలిస్ట్ వైజయంతిగా దేవి నాగవల్లి ఉన్నంతలో మెప్పించింది. విక్రమ్‌ పాత్రలో సమర్థ్‌ యుగ్‌ స్టయిలీష్ గా ఆకట్టుకున్నాడు. మధునందన్‌ మరో మెప్పించే పాత్ర అవుతుంది. ముఖ్యంగా నిహాల్‌, దృషికాలో ఆద్యంతం మెప్పించడంతోపాటు సినిమాని తన భుజాలపై మోశారని చెప్పొచ్చు. 

టెక్నీషియన్లుః 

చిన్న సినిమా అయినా చాలా క్వాలిటీతో తెరకెక్కించారు. నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. ఆ విషయంలో జెన్‌ నెక్ట్స్ ప్రొడక్షన్‌ని అభినందించాల్సిందే. గిడియన్‌ కట్టా సంగీతం వినసొంపుగా బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే బీజీఎం సరిపోలేదు. ఆ డోస్‌ కొద్దిగా పెంచాల్సింది. రేసిగా నడిపించేలా చేస్తే ఇంకా బాగుండేది. అమర్‌ దీప్‌ గుత్తుల కెమెరా వర్క్ సూపర్బ్. సినిమాకి కెమెరా వర్క్ ఓ అసెట్. ప్రవీణ పూడి ఎడిటింగ్‌ కి కొంత పనిచెప్పాల్సిందే. చాలా చోట్ల అనవసర సన్నివేశాలు కనిపించాయి. మరో పది నిమిషాలు కట్‌ చేసినా బాగుండేది. ఇక ఫైనల్‌గా దర్శకుడు రవి ప్రకాష్‌ దర్శకుడిగా చాలా బాగా చేశాడు. సినిమాని బాగా తెరకెక్కించారు. నెరేషన్‌ పరంగా స్పీడ్‌ పెంచితే బాగుండేది, సీన్లు, డైలాగ్‌లు యాప్ట్ గా కథని ముందుకి తీసుకెళ్లేలా ఉన్నాయి. కానీ సెకండాఫ్‌లో ఇంకా కేర్‌ తీసుకుంటే బాగుండేది, ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌, ఆయా సన్నివేశాలు నడిపించడం పట్ల మరింత జాగ్రత్త పడి, కొంత ఎంటర్‌టైన్‌మెంట్‌ పైఫోకస్‌ పెడితే సినిమా ఫలితం మరో స్థాయిలో ఉండేది. మొత్తానికి ఇదొక మంచి రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అని చెప్పొచ్చు. 

రేటింగ్‌ః 2.5

click me!