'ఉప్పెన' హీరో కొత్త చిత్రానికి పవర్ ఫుల్ టైటిల్, మామూలుగా లేదుగా

Published : May 12, 2023, 06:38 AM IST
 'ఉప్పెన' హీరో కొత్త చిత్రానికి పవర్ ఫుల్  టైటిల్, మామూలుగా లేదుగా

సారాంశం

మొదటి సినిమా ‘ఉప్పెన’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట వైష్ణవ్.  

సినిమాలకు టైటిల్ అనేది కీలకంగా మారింది. టైటిల్, ట్రైలర్ బాగుంటే బిజినెస్ అయ్యిపోతోంది. దాంతో దర్శక,నిర్మాతలు టైటిల్ ని ప్రకటించేముందు చాలా పెద్ద కసరత్తే చేస్తున్నారు. ముఖ్యంగా జనాల్లోకి తాము అనుకున్న టైటిల్ వెళ్తుందా లేదా అనేది లీక్ చేసి రెస్పాన్స్ చూసి బాగుందనుకుంటే ముందుకు వెళ్తున్నారు. తాజాగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్  #PVT04 టైటిల్  లీక్ అయ్యింది. ఈ సినిమా కు రెండు టైటిల్స్  అనుకుంటున్నారట. వాటిల్లో ఒకటి ఫైనలైజ్ చేస్తారని వినికిడి. ఆ టైటిల్స్ ఏమిటంటే...

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపొందున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ గురించి అప్డేట్ మేకర్స్ ఇవ్వనున్నారని తెలిసింది. ఆ టైటిల్ సైతం చాలా పవర్ ఫుల్ గా యాక్షన్ సినిమా అని తెలిసేటట్లు ప్లాన్ చేస్తున్నారట. వాళ్లు అనుకున్నట్లుగా ప్రచారం జరుగుతున్న రెండు టైటిల్స్  ‘ఆదికేశవ’లేదా ‘ముక్కంటి’. వీటిలో ఒకటి ఫైనలైజ్ చేయబోతున్నారట.   

రీసెంట్ గా ఈ సినిమాలో విలన్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో మలయాళ స్టార్ నటుడు జోజు జార్జ్‌ను విలన్ గా ఎంపిక చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాలో ఆయన ‘చెంగా రెడ్డి’ అనే ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలిపారు. అలాగే  బీస్ట్‌ ఫేం అపర్ణా దాస్ ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇందులో వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర పోషిస్తోంది అపర్ణా దాస్. తెలుగులో అపర్ణా దాస్‌కు ఇది మొదటి సినిమా.  

మొదటి సినిమా ‘ఉప్పెన’తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారట వైష్ణవ్. ఈ సినిమాలో వైష్ణవ్ పూర్తి స్థాయిలో మాస్ అవతారంలో కనిపించనున్నారని టాక్. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్  -ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యాన‌ర్లు PVT 4ను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందతో తెలియజేస్తూ.. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. 

‘రేయ్ రాముడు లంక మీద ప‌డ‌టం ఇనుంటావ్‌..అదే ప‌ది త‌ల‌కాయ‌లు ఊడి అయోధ్య మీద ప‌డితే ఎట్టుంటాదో చూస్తావా..అని విల‌న్ అంటుంటే..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాద‌ప్ప‌.. ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు..త‌ల‌లు కోసి చేతికిస్తా నా యాళ’ అంటూ సాగే డైలాగ్స్‌తో సాగుతున్న గ్లింప్స్ వీడియో గూస్‌ బంప్స్ తెప్పిస్తోంది. ప్రొడక్షన్‌ నంబ‌ర్ 16గా తెరకెక్కుతున్న ఈ మూవీని 2023 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీని నాగ‌వంశి, సాయి సౌజ‌న్య నిర్మిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

వెంకటేష్ రీమేక్ సినిమాలు మాత్రమే ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి? వెంకీ రీమేక్ మూవీస్ లిస్ట్ లో బ్లాక్ బస్టర్స్
Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు, బాక్సాఫీసు వద్ద దుమారం.. బాలయ్య టాప్‌ 5 ఓపెనింగ్స్