'బలగం' ఫస్ట్ ఛాయిస్ ప్రియదర్శి కాదా, ఆ యంగ్ హీరోనా?

Published : May 12, 2023, 06:25 AM IST
   'బలగం' ఫస్ట్ ఛాయిస్ ప్రియదర్శి కాదా, ఆ యంగ్ హీరోనా?

సారాంశం

తెలంగాణలోని పల్లెటూరి చుట్టూ తిరిగే కథాంశంతో ఉంది చిత్రం.  ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ లవ్‌ ట్రాక్‌, పెళ్లి.. తాత మరణం, కుటుంబం ఏకం అవటం వంటిఇతర అంశాల చుట్టూ తిరుగుతూ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. 


ఒకరికి అనుకున్న పాత్రను మరొరకి వెళ్లటం ఇండస్ట్రీలో మామూలే.  సినిమా సూపర్ హిట్టయ్యాక అర్రేరే మంచి క్యారక్టర్ ని మిస్ చేసుకున్నామే అని చాలా సార్లు అనుకుంటూంటారు. అలాంటిదే తాజాగా ఓ సంఘటన జరిగిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. రీసెంట్ గా బలగం సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఊరు,వాడా ఈ సినిమాని షోలు వేసుకుని మరీ చూసారు. ఈ సినిమాలో హీరో ప్రియదర్శి. అయితే ప్రియదర్శి కన్నా ముందు వేరే హీరోని అనుకుని,కాదనుకుంటేనే దర్శ దగ్గరకు ఈ పాత్ర వచ్చిందని సమాచారం.   

తనదైన కామెడీ నవ్విస్తూ...ఒక్కోసారి సీరియస్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్దానం సంపాదించుకున్నాడు ప్రియదర్శి (Priyadarshi). ఆ మధ్యన వచ్చిన మల్లేశం సినిమాతో హీరోగా కూడా మారిపోయాడు. ఈ నటుడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బలగం’. కావ్యా కల్యాణ్‌రామ్ (Kavya Kalyanram) ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించగా.. సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ లీడ్‌ రోల్స్‌ లో నటించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదట కాస్త తడబడినా తర్వాత గట్టిగా నిలబడింది. 

తెలంగాణలోని పల్లెటూరి చుట్టూ తిరిగే కథాంశంతో ఉంది చిత్రం.  ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ లవ్‌ ట్రాక్‌, పెళ్లి.. తాత మరణం, కుటుంబం ఏకం అవటం వంటిఇతర అంశాల చుట్టూ తిరుగుతూ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాకు మొదట యంగ్ హీరో శ్రీవిష్ణుని ప్రధాన పాత్రకు అనుకుని కలిసినట్లు చెప్తున్నారు. అయితే తను తెలంగాణా యాస అంత ఫెరఫెక్ట్ గా పలకలేను అనే ఉద్దేశ్యంతో నో చెప్పినట్లు వినికిడి. దాంతో ప్రియదర్శిని ఎప్రోచ్ అయ్యినట్లు తెలుస్తోంది. శ్రీవిష్ణు చేసి ఉంటే కమర్షియల్ మార్కెట్ సైతం యాడ్ అయ్యేదని భావించారు కానీ సినిమా సూపర్ హిట్ అవటంతో ఆ లోటు తీరిపోయినట్లు అయ్యింది. 

రియలిస్టిక్ అప్రోచ్‌తో వెళ్దామనుకున్నప్పుడు ఈ కథ పుట్టిందని చెప్పిన వేణు.. ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రొడక్షన్‌ దగ్గరికి వెళ్లాక మార్కెట్ ఉన్న హీరో కావాలని డిసైడ్ అయినట్లు వెల్లడించారు. అలా ప్రియదర్శిని ఎంటర్ అయ్యాడని తెలిపాడు. నిజానికి ప్రూవ్ చేసుకునేందుకు తనకు కూడా ఒక ప్రొఫైల్ కావాలి కాబట్టి హీరో క్యారెక్టర్‌ను త్యాగం చేశానని చెప్పాడు. అయితే ఇది అర్థవంతమైన త్యాగమే అనిపించిందని.. ఆ క్యారెక్టర్‌కు ప్రియదర్శి పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాడన్నాడు. మొత్తానికి హీరోగా చేద్దామనుకుని చివరకు ‘నర్సి’ ఒక చిన్న కామెడీ క్యారెక్టర్‌తో సరిపెట్టుకున్నానని తెలిపాడు.  

ఈ చిత్రాన్నిశిరీష్‌ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. మార్చి 3న థియేటర్లలో సందడి చేసింది.  ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిచారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధుత్వాలు, సమస్యల మూలాలను గుర్తు చేసేలా సాగిన బలగం  జనాల్లోకి వెళ్లిపోయింది.  
 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?