రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసిన మోడల్ సాగరిక కు రేప్ బెదిరింపులు

By team teluguFirst Published Jul 23, 2021, 2:59 PM IST
Highlights

 రాజ్ కుంద్రాపై సాగరిక ఆరోపణలు నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు కాల్స్ వస్తున్నట్లు, ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. 
 

బాలీవుడ్ నటి రాజ్ కుంద్రా భర్త ఫోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన విషయం తెలిసిందే. గతంలో ఓ యాప్ కోసం రాజ్ కుంద్రా తనను న్యూడ్ ఫోటో షూట్ చేయాలని సంప్రదించినట్లు మోడల్ సాగరిక షోనా సుమన్ తెలియజేశారు. రాజ్ కుంద్రాపై సాగరిక ఆరోపణలు నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు కాల్స్ వస్తున్నట్లు, ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు వెల్లడించారు. 


వాట్స్ యాప్, మెస్సెంజర్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తనకు కొందరు కాల్స్ చేస్తున్నారని ఆమె తెలిపారు. రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేస్తావా, నిన్ను రేప్ చేస్తాం, చంపేస్తాం అంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ ఫోన్ నంబర్స్ నుండి కాల్స్ చేస్తూ... మీరు చూస్తున్నారు కాబట్టే పోర్న్ వీడియోలు తీస్తున్నాం, అందులో తప్పేముందని వాదిస్తున్నారని సాగరిక తెలిపారు. 


తనకు సదరు వ్యక్తుల నుండి ప్రాణహాని ఉందని, నేను వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను.. అంటూ సాగరిక సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 2020 ఆగస్టులో ఓ వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తాం, కాకపోతే ఓ న్యూడ్ ఫోటో షూట్ చేయాలని, సాగరికను రాజ్ కుంద్రా తరపు వ్యక్తులు కోరినట్లు సాగరిక ఆరోపించారు. ఇదే విషయాన్ని అప్పుడు మీడియా ముందు వెల్లడించినట్లు తెలియజేశారు.

click me!