ఇటలీలో మెగా అండ్ కామినేని ఫ్యామిలీ.. ఆ విషయంలో జాగ్రత్త పడుతున్న చరణ్, ఉపాసన!

By Asianet News  |  First Published Oct 29, 2023, 5:07 PM IST

మెగా ఫ్యామిలీ అండ్ కామినేని కుటుంబం ఓకే ఫ్రేమ్ లో మెరిసింది. తాజాగా ఇటలీ నుంచి పంచుకున్న ఫొటో మెగా అభిమానులకు ఐఫీస్ట్ గా మారింది. కుటుంబమంతా ఒకే చోట చేరడం విశేషంగా మారింది.
 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)  -  యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) రెండ్రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో పాటు రిలేటీవ్స్ అందరూ డెస్టినేషన్ కు చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ వరుణ్, లావణ్య, కుటుంబంతో సహా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇటలీకి చేరుకున్న విషయం తెలిసిందే. 

వరుణ్ - లావణ్య వెడ్డింగ్ నవంబర్ 1న హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రాండ్ గా జరగనుంది. పెళ్లి ముహుర్తానికి ఇంకా సమయం ఉండటంతో ముందుగానే అక్కడికి చేరుకున్న కొణిదెల అండ్ కామినేని ఫ్యామిలీ హాలీడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటలీ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఫొటోను పంచుకోవడంతో అభిమాలనులు ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

undefined

తల్లిదండ్రులు, అత్తామమాతో రామ్ చరణ్, ఉపాసన క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. అలాగు చిరంజీవి కూతుర్లు, మెగా ప్రిన్సెస్ క్లీంకారా, కామినేని కుటుంబ సభ్యులు ఓకే ఫ్రేమ్ లో కనిపించడం విశేషంగా మారింది. ఈ ఫొటోను రామ్ చరణ్ స్వయంగా తన వాట్సాప్ ఛానెల్ లో షేర్ చేశారు. ఇక ఫ్యాన్స్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ బ్యూటీఫుల్ మెగా అండ్ కామినేని ఫొటోను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే, మెగా మనవరాలు క్లీంకార కూడా ఈ ఫొటోలో ఉండటం విశేషం. అయితే ఫొటోను షేర్ చేస్తూ చెర్రీ మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించకుండా హార్ట్ ఎమోజీతో దాచేశారు. చిన్నారి ముఖాన్ని మీడియా కంటపడకుండా తమ అఫీషియల్ ఫొటోషూట్లలో జాగ్రత్తపడుతూ వస్తున్నారు.

రెండు రోజుల్లో వరుణ్ తేజ్ - లావణ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇరు కుటుంబాలు పూర్తి చేశాయి. ఉపాసన కూడా గ్రాండ్ గా ఏర్పాట్లు చేయిస్తున్నట్టు సమాచారం. పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ జరగనుంది. వరుణ్ పెళ్లితో మెగా ఇంట సందడి వాతావరణం నెలకొంది. 

click me!