శనివారం నాగార్జున ఒక్కొక్కరినీ వాయించి పడేశాడు. వాళ్లలో యావర్ కూడా ఉన్నాడు. రతిక ట్రాప్ లో పడ్డ యావర్ గేమ్ పడిపోయిందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు.
రీఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ గేమ్లో నిజాయితీ కనిపించడం లేదు. ఆమె మొదట్లో ఏం చేసిందో మళ్ళీ అదే చేస్తుంది. హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా అదే. పల్లవి ప్రశాంత్ తో సన్నిహితంగా ఉంటూనే నామిషన్స్ లో అతన్ని అనరాని మాటలు అంది. ప్రశాంత్ పేరెంట్స్ ని కూడా తూలనాడింది. దాంతో పల్లవి ప్రశాంత్ ఆమెతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నాడు. అయితే యావర్ రతిక ట్రాప్ లో పడ్డాడు. ఆమెతోనే ఉంటున్నాడు. చివరికి రతిక శుభ్రం చేయాల్సిన పాత్రలు తాను శుభ్రం చేస్తున్నాడు.
రతిక ఎంట్రీ తర్వాత యావర్ గేమ్ డల్ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్కుల్లో ఒక్కటి కూడా గెలవలేదు. ఇదే విషయం నాగార్జున లేవనెత్తాడు. రతిక పేరు చెప్పకుండా... నీ దృష్టి వ్యక్తుల మీద కాదు ఆట మీద ఉండాలని చెప్పాడు. నీ పెర్ఫార్మన్స్ ఈ వారం దిగజారిపోయిందని చెప్పాడు. నేను చెప్పింది నీకు అర్థమయ్యిందనుకుంటా అని నొక్కి నొక్కి చెప్పాడు నాగార్జున.
యావర్ మారాడా? ఇకపై రతికకు దూరంగా ఉంటాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ఆదివారం టాస్క్ లో నాగార్జున యావర్ కి ఈ పరీక్ష పెట్టాడు. తన బోట్ లో శివాజీ రతిక ఉన్నారు. మునిగిపోకుండా ఉండాలంటే ఒకరిని దించేయాలి. ఎవరిని దించుతావు, ఎవరిని సేవ్ చేస్తావని అడిగాడు. యావర్ ఈ ప్రశ్నకు సమాధానం చాలా కష్టంగా చెప్పాడు. నేను చెప్పే సమాధానం వలన ఇంటిని నుండి బయటకు వెళ్ళాక ఏం జరుగుతుందో భయం వేస్తుందని యావర్ అన్నాడు.
మొత్తానికి రతికను నీటిలో ముంచి శివాజీని సేవ్ చేస్తాను అన్నాడు. ఈ ఆన్సర్ అతడు రతికకు దూరమై గేమ్ మీద ఫోకస్ పెడతాడని అనిపిస్తుంది. మరి చూడాలి సోమవారం నుండి రతికతో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో...