ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రెటీలకు ప్రమాదకరంగా మారుతోంది. సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో సులభంగా లీక్ అవుతున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియా సెలెబ్రెటీలకు ప్రమాదకరంగా మారుతోంది. సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ విషయాలు కూడా సోషల్ మీడియాలో సులభంగా లీక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎంతో గోప్యంగా ఉండాల్సిన మహిళా సెలెబ్రిటీల ప్రైవేట్ విషయాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవుతూ చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
తాజాగా పాకిస్తాన్ కి చెందిన గ్లామరస్ యూట్యూబర్ అలీజా సహారా చిక్కుల్లో పడింది. పాకిస్తాన్ లో అలీజా ఎంతో పాపులర్ అయిన యూట్యూబర్ గా రాణిస్తోంది. పాకిస్తాన్ గ్రామీణ ప్రాంతాలని అక్కడ సంస్కృతులని హైలైట్ చేస్తూ రాణిస్తోంది.
అయితే తాజాగా అలీజా ప్రైవేట్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో లీకై సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో ఆమె ప్రైవేట్ దృశ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తితో అలీజా వీడియో కాల్ మాట్లాడుతూ సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది. మధ్యలో ఆమె తన దుస్తులు విప్పేస్తూ అసహ్యంగా కనిపించిందట.
అంతే కాదు ఇద్దరూ అసభ్యకర పదజాలంతో మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఎలా లీక్ అయిందో కానీ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో ఉన్నది తాను కాదని.. ఎవరో మార్ఫింగ్ చేసి లీక్ చేశారని ఆరోపిస్తోంది. ఆమె పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి ఫిర్యాదు చేసింది. అలాగే సైబర్ క్రైమ్ టీమ్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ వీడియోలో ఉన్నది ఆమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.