అప్పుడు ఆలియా భట్.. ఇప్పుడు జాన్వీ కపూర్... క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే దారుణంగా హీరోయిన్ల పాత్రలు..

By Mahesh Jujjuri  |  First Published Sep 28, 2024, 7:00 PM IST

రాను రాను సినిమాల్లో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతోంది. గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఇక టాలీవుడ్ లోకి గంపెడు ఆశలతో వస్తున్న బాలీవుడు స్టార్ హీరోయిన్లకు ఎలాంటి పాత్రలు దక్కుతున్నాయంటే..? 


రాను రాను సినిమాల్లో హీరోయిన్లకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోతోంది. గ్లామర్ బొమ్మలుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఇక టాలీవుడ్ లోకి గంపెడు ఆశలతో వస్తున్న బాలీవుడు స్టార్ హీరోయిన్లకు ఎలాంటి పాత్రలు దక్కుతున్నాయంటే..? 

బాలీవుడ్ నుంచి కోటి ఆశలతో పాన్ ఇండియా హీరోయిన్లుగా మారాలని టాలీవుడ్ కు ఎగేసుకునివస్తున్నారు స్టార్ హీరోయిన్లు. అయితే వారి పరిస్థితి మాత్రం ఇక్కడ దారుణంగా మారిపోతోంది. హీరోకి సమానమైన స్టార్ డమ్ ఉంటుంది.. కెరీర్ పరంగా తిరుగుండదు.. సినిమా కథను టర్న్ చేసే పాత్ర ఉంటుంది అనుకుంటే.. హీరోయిన్ల పాత్రలు గ్లామర్ వరకే పరిమితం అవుతున్నాయి. ఇలా ఒకరికి కాదు చాలామంది బాలీవుడ్ తారల పరిస్థితి ఇలానే ఉంది. 

దేవరలో జాన్వీ కపూర్ ఎందుకు..?

Latest Videos

undefined

తాజాగా చూసుకుంటే దేవర సినిమాలో జాన్వీ కపూర్ కు ఎంత హైప్ ఇచ్చరో అంత గా నిరాశపరిచారు. ఈసినిమాలో జాన్వీ కపూర్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అనుకున్నారంతా.. ఆమెకు పాత్రతో కథ మలుపులు తిరుగుతంది అనుకున్నారు. పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు జాన్వీకి గట్టిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది అనుకున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ తో రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అవ్వగానే.. దేవర సినిమా యాక్షన్ కు తోడు.. జాన్వీ కపూర్ గ్లామర్ కలిస్తే.. సినిమా ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో అని ఊహించుకున్నారు. 

AlSo Read:  ఒరేయ్ తమ్ముడు అంటూ.. సావిత్రి ప్రేమగా పిలిచే స్టార్ డైరెక్టర్ ,,?

కాని అక్కడ జరిగింది మాత్రం వేరు. దేవర సినిమా మొత్తం మీద ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశారు. ఆయన తరువాత అంత యాక్టింగ్ స్కోప్ ఉంది సైఫ్ అలీ ఖాన్ పాత్రకే. ఇక జాన్వీ కపూర్ పాత్ర సెకండ్ ఆఫ్ లో వస్తుంది. అప్పుడప్పుడు అలా రావడం.. తన మొగుడు గురించి కలలు కంటూ.. ఫ్రెండ్స్ కు ఆ  విషయం చెప్పడం.. ఎన్టీఆర్ ను చూసి మెలికలు తిరగడం.. ఈ మధ్యలో ఒ రొమాంటిక్ సాంత్. ఇక ఆ రొమాంటిక్ సాంగ్ ను వదిలేస్తే.. జాన్వీ కపూర్ కు పట్టుమని పది నిమిషాల  పాత్ర కూడా లేదు దేవరలో. 

ఇక ఈ పాటిదానికేనా..జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. భారీ రెమ్యునరేషన్ అంటూ.. కథలు కథలుగా వినిపించింది అని ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. అంతే కాదు  దేవర సెకండ్ పార్టులో జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందేమో.. అందుకే ఈ పార్టులో.. అలా వదిలేసి ఉంటారు అని అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

ఆర్ఆర్ఆర్ లో ఆలియా పరిస్థితి కూడా అంతే...

ఇప్పుడు జాన్వీ కపూర్ పరిస్థితి ఎలా ఉందో.. ఆమె పాత్రను చూసి అందరు ఏమనుకుంటున్నారో.. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన వాళ్లు కూడా ఆలియా భట్ పాత్ర విషయంలో ఇలానే అనుకున్నారు. అవును రామ్ చరణ్ మరదలిగా.. ఆయన కాబోయే భార్య సీత పాత్రలో ఆలియా భట్ కనిపించింది. అయితే సెకండ్ పార్ట్ లో ఓ రెండు మూడు సీన్లు తప్పించి ఆమె ఎక్కడా ఎక్కువగా కనిపించింది లేదు. ఇక దేవరలో జాన్వీ సాంగ్ ఎలా చేసిందో.. ఆర్ఆర్ఆర్ లో ఆలియా దేశ భక్తి గీతంలో కనిపించింది. అంతకు మించి ఆలియా భట్ పాత్రకు ఆర్ఆర్ఆర్ లో పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. 

AlSo Read: శ్రీ దేవికి అహంకారం ఎక్కువ.. జయప్రద కామెంట్స్


అంతే కాదు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు కూడా ఆలియా భట్  విషయంలో భారీగా హైప్ ఇచ్చారు. తీరా చూస్తే పాత్ర చాలా తక్కువగా ఉంది. అయితే  ఈ విషయంలో ఆలియా భట్ అలిగిందని.. అందుకే సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే ఆలియా.. ఈ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఎటువంటి పోస్టింగ్ లు పెట్టలేదని విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమా ఆస్కార్ హాడావిడిలో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆస్కార్ సాధించినా కూడా చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు ఆలియా. దాంతో సినిమా షూటింగ్ లో ఆలియా పాత్ర పెద్దగానే ఉంది. కాని ఎడిటింగ్ లో తప్పక లేపేయాల్సి వచ్చిందన్న వాదన కూడా వినిపించింది. 

కియారాకు ఈసారైనా న్యాయం జరుగుతుందా..? 

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన కియారా అద్వానికి కూడా ఒకప్పుడు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆమె బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ జోడీగా నటించింది. అదే ఆమె మొదటి తెలుగు సినిమా. అయితే ఈ సినిమాలో గ్లామర్ టచ్ కోసం మాత్రమే కియారాను తీసుకున్నట్టు అనిపించింది. ఏదో అప్పుడప్పుడు నేనున్న అన్నట్టు వచ్చి వెళ్తుంది ఈ పాత్ర. ఇక డ్యూయోట్ కోసం హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి కదా..? 

సినిమా  సీరియస్ గా సాగుతున్న టైమ్ లోరిలాక్స్ కోసం సాంగ్ ఇరికించాల్సిన టైమ్ లో.. హీరోయిన్ తో కనెక్టింగ్ సీన్ పెట్టి.. డ్యూయెట్ కు రూట్ క్లియర్ చేసేవారు దర్శకుడు. దాంతో వినయ విధేయ రామాలో మంచి నటిగా పేరున్న కియారాకు యాక్టింగ్ స్కోప్ లేకుండా పోయింది. దాంతో ఆమె ఆతరువాత టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ప్రస్తతం శంకర్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ జంటగా.. గేమ్ ఛేంజర్ లోనటిస్తోంది కియారా.. మరి ఈసారి అయినా ఆమెకు యాక్టింగ్ స్కోప్ ఉన్న హీరోయిన్ పాత్ర దొరికినట్టేనా.. శంకర్ అయినా న్యాయం చేస్తాడా లేదా చూడాలి. 

బాలీవుడ్ హీరోయిన్లకే ఎందుకు ఇలా..? 

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వస్తున్న హీరోయిన్లకే ఇలాంటి పరిస్థితి వస్తోంది. గతంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ ఒకటి రెండు సినిమాలు చేసి.. బాలీవుడ్ వైపు వెళ్ళి.. అక్కడ క్లిక్ అయిన హీరోయిన్లు చాలా మంది  ఉన్నారు. వారు అయితే టాలీవుడ్ వైపు తిరిగి కూడా చూడలేదు. అలాంటి వారిలో కత్రీనా కైఫ్, కృతీ సనన్, తాప్సీ లాంటివారు ఉన్నారు. అయితే వీరు టాలీవుడ్  సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కాని ఇక్కడ వారికి అనుకున్నంత క్రేజ్ రాకపోవడంతో.. అది వెతుక్కుంటూ.. బాలీవుడ్ కు వెళ్ళారు. 

అక్కడ మంచి క్రేజ్ తో పాటు స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా దక్కడంతో.. వీరు మళ్ళీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. ఇలా చాలామంది హీరోయిన్లు టాలీవుడ్ లోకి ఇప్పటికీ రావాలని అనుకుంటున్నారు. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడంతో.. ఇక్కడ సినిమా చేస్తే.. పాన్ ఇండియ స్టార్ గా మారవచ్చు అని ఆలోచిస్తున్నారు. అందుకే హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. ఇక జాన్వీ కపూర్ దేవర సినిమాతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో కూడా నటిస్తోంది. మరి ఆసినిమాలో అయినా ఆమెకు మంచి పాత్రదక్కుతుందా చూడాలి. 

ఈమూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. చరణ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి. ఇక ఇలా ముందు ముందు కూడా బాలీవుడ్ నుంచి హీరోయిన్లు టాలీవుడ్ కు వరలస వచ్చే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందో..?   

click me!