మహానటి సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన వరం. ఆమె చాలా మందిని ప్రేమగా, చనువుగా పిలిచేవారు. అందులో ఒక స్టార్ దర్శకుడిని 'ఒరేయ్ తమ్ముడూ' అని పిలిచేవారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఉన్నారు. వారిలో ప్రేమగా.. సొంత మనుషుల్ల కొందరే ఉన్నారు. అందులో మహానటి సావిత్రి ఒకరు. ఇక ఆమె ప్రేమగా.. చనువుగా.. ఒరేయ్ తమ్ముడూ.. అని ఓ స్టార్ దర్శకుడిని పిలిచేవారట. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?
మహానటి సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన వరం. ఆమె మరణించి 40 ఏళ్ళకు పైగా అవుతున్నా.. ఆమె తెలుగుప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోయారు. ఆమె చేసిన పాత్రలు, ఆమె అందం, అభినయం.. మన ఇంటి ఆడపడుచు మాదిరి ఉండేవారు సావిత్రి. అయితే ఆమె ఇండస్ట్రీలో చాలామందిని ప్రేమగా వరసలతో పిలిచేవారట. సావిత్రిని కూడా సొంత కుటుంబంలో ఒకరిగా చూసుకునే తారలు చాలామంది ఉన్నారు.
undefined
జమున లాంటివారిని ఇండస్ట్రీకి తీసుకువచ్చింది సావిత్రి. అందుకే అక్కయ్య అని జమున కూడా ప్రేమగా పిలిచేవారట. అయితే సావిత్రిని అక్కయ్య అని ప్రేమగా పిలిచే వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు. స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ దివంగత దాసరి నారాయణ రావు. అవును ఆయన సావిత్రిని చాలా ప్రేమగా అక్కయ్య అని పిలిచేవారట. అంతే కాదు సావిత్రి కూడా ఆయన్ను ప్రేమగా తమ్మడు.. ఒరేయ్ తమ్ముడూ.. అంటూ చనువుగా పిలిచేవారట.
ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో స్టార్ దాసరి నారాయణ రావు చెప్పుకునేవారు. ఆయన బ్రతికున్న రోజుల్లో ప్రతీ ఇంటర్వ్యూల్లో దాసరి సావిత్రి గురించి చాలా గొప్పగా చెప్పేవారు. ఆమె ఎంతో మందికి మేలు చేసిందని. చివరకు ఆమె అన్యాయం అయిపోయారని ఆయన వాపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతే కాదు సావిత్రిని తలుచుకుని దాసరి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
మహానటి సావిత్ర ఫిల్మ్ ఇండస్ట్రీలో తారగావెలుగు వెలిగింది. ఎన్నో సాధించింది. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. నాలుగైదు భాషల్లో సినిమాలు చేసింది. ఎంతో మందికి వేలకు వేలు సాయంగా అందించింది. కాని ఆమె చివరి రోజుల్లో మాత్రం ఒంటరితనంతో బాధపడింది. పలకరించేవారు లేక.. నా అన్నవారు కనపడక ఎంతో బాధపడింది. తన సాయం పొందిన వారు కూడా ఆమెను పట్టించుకోలేదు.
చివరకు సావిత్రి మరణించిన తరువాత కూడా ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరూ చూడటానికి వెళ్ళలేదు అంటే ఎంత అన్యాయమో అర్ధం అవతుంది. ఇక సావిత్రి మరణించిందని తెలుసి వెళ్ళిన వారు టాలీవుడ్ నుంచి ముగ్గురే ముగ్గురు స్టార్స్ ఉన్నారు. అందులో దాసరి నారాయణ రావు, అక్కినేని నాగేశ్వరావు, మురళీ మోహన్. ఈ ముగ్గురు మాత్రమే సావిత్రిని చూడటానికి వెళ్ళారట.
అయితే అప్పటికే అంతిమ యాత్ర స్టార్ట్ అవ్వడంతో.. ఈ ముగ్గురు ఎయిర్ పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అంత్యక్రియల దగ్గరకు వెళ్ళార. ఇక ఆఅంతిమయాత్రలో.. సావిత్రి ఇంటి చుట్టుపక్కల స్లమ్ లో ఉండే జనాలుతప్పించి సినిమావాళ్లు ఎవరూ లేరని ఓ సందర్భంలో మురీ మోహన్ చెప్పుకోచ్చారు. ఇండస్ట్రీ డబ్బు ఉంటే ఒక లాగా.. డబ్బులేకపోతే మరోలా ట్రీట్ చేస్తారన్నారు మురళీమోహన్.
సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్‌లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. ఇదిలా ఉంటే సావిత్రి జీవితకథను `మహానటి` చిత్ర రూపంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. ఇది భారీ ఆదరణ పొందింది. ఇందులో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్‌కి జాతీయ అవార్డు రావడం విశేషం
సావిత్రి వైవాహిక జీవితంలో ఓడిపోయారు. ఆమె జెమినీ గణేష్ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ఆయన సావిత్రిని మోసం చేశాడనే విషయం తెలిసిందే. నా అనుకున్న వారంతా మోసం చేశారు. మరోవైపు సినిమాలు నిర్మించి నష్టపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. పెద్ద భవంతిలో అద్భుమైన లైఫ్ ను చూసిన సావిత్రి.. ఆతరువాత పాత ఇంట్లో సాధారణ జీవితం గడిపారు. అయినా కూడా తన దగ్గరకు సాయం కోసం వచ్చినవారికి తన ఇంట్లో వస్తువలు.. చీరలు అమ్మి డబ్బులు ఇచ్చేవారు.
ఇక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉన్న సావిత్రి..ఓ సినిమా షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళి.. అక్కడి హోటల్ లో.. ఆల్కాహాల్ తీసుకుంది. అక్కడే అస్వస్థతకు గురై.. కోమాలోకి వెళ్లింది సావిత్రి. దాదాపు 14 నెలల పాటు కోమాలో ఉన్న సావిత్రి.. చిక్కి శల్యమై.. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కూడా అర్ధం కాని పరిస్థితుల్లో మరణించింది.
పెళ్ళిచేసి చూడు` సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి.. ఈ సినిమాలో ఆమె చేసింది సెకండ్ హీరోయిన్ పాత్ర మాత్రమే. ఇక 1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపుతిప్పింది. ఉర్రూతలూగించిన `దేవదాసు` సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది.
ఇక ఆతరువాత సావిత్రి జీవితంలో మయా బజార్, గుండమ్మ కథ, మిస్మమ్మ.. ఇలా చెప్పకుంటూ వెళ్తే ఎన్నో పాత్రలు ఆమెను మహానటిగా గుర్తింపు రావడానికి కారణం అయ్యాయి. మరీ ముఖ్యంగా మిస్సమ్మ, మాయా బజార్ లో సావిత్రి నటనకు విమర్శకులు కూడా సలాం చేశారట.