
కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘పొన్నియన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ అదిరిపోయేలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమిళ నాట సూపర్ స్టార్ తోపాటు, బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కూడా ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగమైంది. పైగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది.
ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గరికి వస్తుండటంతో సినిమా ఆడియో, డిజిటల్ రైట్స్ ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ ‘పీఎస్ 1’ ఆడియోను దక్కించుకున్నట్టు కోలీవుడ్ లో టాక్. కేవలం ఆడియోకే రూ. 24 కోట్లు పలికినట్టు సమాచారం. తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ డిజిటల్ రైట్స్ కూడా ఎవరూ ఊహించని ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ భారీ చిత్రం డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. రూ.125 కోట్ల తో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లోనే ఇంత పెద్దమొత్తంలో ఓటీటీ డీల్ కుదరడం విశేషం.
ఈ పీరియాడ్ యాక్షన్ డ్రామాలో తమిళ సూపర్ స్టార్స్ నటిస్తుండటం ఆడియెన్స్ లో ఆసక్తిని నెలకొల్పుతోంది. చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి హీరోలుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), త్రిష క్రిష్ణన్, శోభితా ధూళిపాళ నటిస్తోంది. మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
1995లో వచ్చిన కల్కి క్రిష్ణమూర్తి పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
తమిళ ఇండస్ట్రీలోనే రూ.500 కోట్లతో తొలి భారీ బడ్జెట్ సినిమా ‘పొన్నియిన్ సెల్వన్ 1’ రూపుదిద్దుకుంది. రిలీజ్ కు ముందే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా సంస్థ, మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా పీఎస్1 రిలీజ్ కాబోతోంది. తమిళంలో రూపొందిన ఈ మూవీ హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నూ విడుదదల కానుంది.