Liger Trailer: `లైగర్‌` ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. బాక్సింగ్‌ రింగ్‌లో విజయ్‌ దేవరకొండ చెడుగుడే

Published : Jul 16, 2022, 05:37 PM IST
Liger Trailer: `లైగర్‌` ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. బాక్సింగ్‌ రింగ్‌లో విజయ్‌ దేవరకొండ చెడుగుడే

సారాంశం

`లైగర్‌` విడుదలకు ముందే విజయ్‌కి పాన్‌ ఇండియా క్రేజ్‌ రావడం విశేషం. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన `లైగర్‌` మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ రాబోతుంది.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. ఆయన నటించిన పాన్ ఇండియా మూవీ `లైగర్‌` విడుదలకు ముందే విజయ్‌కి పాన్‌ ఇండియా క్రేజ్‌ రావడం విశేషం. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన `లైగర్‌` మూవీ నుంచి మరో సర్‌ప్రైజ్‌ రాబోతుంది. తన ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అయ్యారు విజయ్‌ దేవరకొండ. `లైగర్‌` ట్రైలర్‌ విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల(జులై) 21న ట్రైలర్‌ని రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్‌, పాటలు విడుదలయ్యాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. బాక్సర్‌గా విజయ్‌ దేవరకొండ లైఫ్‌ని క్రిస్పీగా ఆవిష్కరించాయి. ముంబయికి చెందిన ఓ ఛాయ్‌వాలా ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎదిగిన తీరుని ఈ చిత్రంలో దర్శకుడు పూరీ ఆవిష్కరించబోతున్నారట. ఈ మాస్‌ యాక్షన్‌, ఎంటర్‌టైనర్‌కి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ సరసన బాలీవుడ్‌ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. 

`లైగర్‌` పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన నేపథ్యంలో ఈ ట్రైలర్‌ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. లైగర్‌ మాస్‌, లైగర్‌ యాక్షన్‌, లైగర్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఒకేసారి రాబోతుందని తెలిపింది యూనిట్. ఈ మూడు అంశాలు ఒకేరోజు ట్రైలర్‌ ద్వారా రాబోతున్నాయనేది డిఫరెంట్‌గా ప్రకటించడం విశేషం. 

ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని విజయ్‌ దేవరకొండ నయా న్యూడ్‌ లుక్‌ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సినిమాపై హైప్‌ని తీసుకొచ్చింది. విజయ్‌ న్యూడ్‌గా కనిపించడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన లుక్‌పై స్టార్‌ హీరోయిన్లు సైతం కామెంట్లు చేయడంతో అది మరింత బజ్‌ని క్రియేట్‌ చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందనే అనే ఆసక్తిని పెంచింది. 

పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ `లైగర్‌` చిత్రాన్ని నిర్మించారు. విజయ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రమిది. వరుస పరాజయాల్లో ఉన్న విజయ్‌ ఈ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు `ఇస్మార్ట్ శంకర్‌` వంటి సక్సెస్‌ తర్వాత పూరీ నుంచి వస్తోన్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో చూడాలి.ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయబోతుంది యూనిట్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌