సూర్య, నాని, దుల్కర్ సల్మాన్ లతో మల్టీస్టారర్.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ స్కెచ్ అదుర్స్, డైరెక్టర్ ఎవరంటే..

Published : Jul 16, 2022, 05:25 PM IST
సూర్య, నాని, దుల్కర్ సల్మాన్ లతో మల్టీస్టారర్.. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ స్కెచ్ అదుర్స్, డైరెక్టర్ ఎవరంటే..

సారాంశం

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2 చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సంస్థ అధినేత విజయ్ కిరగందూర్ కెజిఎఫ్ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మించారు. ఆశించిన దానికంటే కెజిఎఫ్ రెండు భాగాలు రెట్టింపు విజయం సాధించాయి. 

హోంబలే సంస్థ కూడా బాగా పాపులర్ అయింది. దీనితో ఈ సంస్థ తదుపరి చిత్రాలని ప్రేక్షకులు ఆసక్తిగా గమనించడం ఖాయం. హోంబలే తదుపరి చిత్రానికి కూడా భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే హోంబలే సంస్థ 'ఆకాశం నీ హద్దురా' ఫేమ్ డైరెక్టర్ సుధా కొంగరతో నెక్స్ట్ మూవీ ప్రకటించారు. ఈ మూవీ భారీ మల్టీస్టారర్ చిత్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళీ క్రేజీ నటుడు దుల్కర్ సల్మాన్, అలాగే తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని కలసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. త్వరలోనే ఈ వార్తని హోంబలే సంస్థ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.  హీరో సూర్యతో సుధా కొంగర తెరకెక్కించిన ఆకాశం నీ హద్దురా చిత్రం ఐఎండిబి రికార్డు రేటింగ్ సొంతం చేసుకుంది. హాలీవుడ్ చిత్రాలని సైతం అధికమించింది. అలాంటి ప్రతిభ కలిగిన మహిళా దర్శకురాలు ముగ్గురు హీరోలతో మల్టీస్టారర్ చిత్రం అంటే మామూలు విషయం కాదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
10 భాషల్లో 90 సినిమాలు.. 50 ఏళ్ల పెళ్లి కాని బ్యాచిలర్ హీరోయిన్ ఎవరో తెలుసా ?