
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. అల్ట్రా స్టైలిష్ లుక్ లో సమంత సరికొత్తగా కనిపించారు. సమంత వేసుకున్న విక్టోరియా బెక్ హామ్ క్రొచెట్ ప్యాచ్ వర్క్ స్కర్ట్ ధర దాదాపు రూ. 65 వేలు అని సమాచారం. ఆమె ధరించిన వజ్రాల నగల ధర మైండ్ బ్లాక్ చేస్తుంది. డైమండ్ స్నేక్ నెక్లెస్ ధర రూ. 2.9 కోట్లు అట, బ్రాస్లెట్ ధర రూ. 2.6 కోట్లు అని సమాచారం. లగ్జరీ బ్రాండ్ బల్గారీ డైమండ్ జ్యువెలరీ ధరించి సమంత ప్రత్యేకత చాటుకున్నారు. వాటి ధర తెలిసిన ఫ్యాన్స్ మైండ్ పోతుంది. ఈ నగల ఖరీదుతో లైఫ్ మొత్తం హ్యాపీగా బ్రతికేయవచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల సమంత ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో ప్రదర్శనకు హాజరయ్యారు. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సిటాడెల్ ఇంటెర్నేషనల్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రీమియర్ కి ఆమె హాజరయ్యారు. సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ చిత్రీకరణ దశలో ఉంది. ప్రియాంక చోప్రా నటించిన ఇంగ్లీష్ సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28 నుండి ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
ప్రస్తుతం సమంత సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ ఖుషి టైటిల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది.
ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి.