
స్టార్ కిడ్స్ కి గిఫ్ట్స్ పంపుతూ హీరోయిన్ అలియా భట్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారను సర్ప్రైజ్ చేశారు. ఆమెకు దుస్తులు గిఫ్ట్ గా పంపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సితార తెలియజేశారు. 'మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బహుమతులు నాకు ఎంతగానో నచ్చాయి' అని కామెంట్ చేశారు. అలియా పంపిన దుస్తులు ధరించి ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సితార పోస్ట్ వైరల్ అవుతుంది. పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
అలియా భట్ 'ఈద్ ఏ మమ్మ'(ED-A-MAMMA) పేరుతో ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ నడుపుతున్నారు. కిడ్స్ వేర్ కి సంబంధించిన ఈ బ్రాండ్ ని అలియా తనదైన శైలిలో ప్రోమోట్ చేస్తున్నారు. గతంలో ఎన్టీఆర్ పిల్లలకు కూడా అలియా భట్ బట్టలు గిఫ్ట్ గా పంపారు. అలియా ఈ విధంగా తన వ్యాపారానికి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చుకుంటుంది. ఈ ముంబై హీరోయిన్ వ్యాపారంలో తన తెలివితేటలు చూపిస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో అలియా భట్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అలియా సీతగా కనిపించారు. అయితే ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎన్టీఆర్ 30లో అలియా భట్ నటించాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.
అలియా గత ఏడాది రన్బీర్ కపూర్ ని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక అమ్మాయి కూడాను. పెళ్లికి ముందే అలియా గర్భవతి అయ్యారు. ఈ క్రమంలో పెళ్ళైన నెలల వ్యవధిలో ఆమెకు డెలివరీ అయ్యింది. ఇదే విషయాన్ని అడిగితే ఆమె సమర్ధించుకున్నారు. కోరుకున్నవాడితో తల్లితనం పొందితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అలియా ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.