టాలీవుడ్ సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ సహా పలువురికి బ్లూ టిక్ తొలగింపు

Published : Apr 21, 2023, 10:21 AM IST
టాలీవుడ్ సెలెబ్రెటీలకు ట్విట్టర్ షాక్.. చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ సహా పలువురికి బ్లూ టిక్ తొలగింపు

సారాంశం

టాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానులతో చేరువగా ఉండేందుకు సోషల్ మీడియాని ఎంచుకుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా అనేక విషయాలని, తమ చిత్రాలకి సంబంధించిన ప్రకటనలని టాలీవుడ్ స్టార్స్ చేస్తుంటారు.

టాలీవుడ్ సెలెబ్రిటీలు అభిమానులతో చేరువగా ఉండేందుకు సోషల్ మీడియాని ఎంచుకుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా అనేక విషయాలని, తమ చిత్రాలకి సంబంధించిన ప్రకటనలని టాలీవుడ్ స్టార్స్ చేస్తుంటారు. అందుకే ట్విట్టర్ లో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లని అభిమానులు మిలియన్ల కొద్దీ ఫాలో అవుతుంటారు. 

అయితే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని చేజిక్కించుకున్న తర్వాత దాని స్వరూపమే మార్చేస్తున్నారు. ట్విట్టర్ లో కొత్త కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. అందులో భాగంగా బ్లూ టిక్ కావాలంటే నెలవారీ లేదా ఏడాది వారీగా సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. సబ్ స్క్రిప్షన్ చార్జీలు చెల్లించకుంటే ఎంతటి సెలెబ్రిటీల బ్లూ టిక్ లు అయినా ఎగిరిపోతాయి అని ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. 

అందుకు అనుగుణంగానే దేశవ్యాప్తంగా చందాలు చెల్లించని తారల బ్లూ టిక్ ఏప్రిల్ 20 నుంచి తొలగించడం మొదలైంది. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సహా చాలా మంది సెలెబ్రిటీలు తమ బ్లూ టిక్ కోల్పోయారు. చిరంజీవి, అల్లు అర్జున్, రాంచరణ్, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, పూజా హెగ్డే, నితిన్, ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సమంత, నాగ చైతన్య, అఖిల్ , మంచు మనోజ్ ఇలా చాలా మంది సెలెబ్రిటీలు తమ బ్లూ టిక్ కోల్పోయారు. 

వీరు బ్లూ టిక్ తిరిగి పొందాలంటే చందాలు చెల్లించి తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలి.ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున, మంచు విష్ణు క్రమం తప్పకుండా చార్జీలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.ఫలితంగా వారి బ్లూ టిక్స్ కొనసాగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thalapathy Vijay: నిర్మాత కూతురి వెడ్డింగ్ రిసెప్షన్ లో దళపతి విజయ్, పట్టు పంచెలో సందడి.. వైరల్ ఫోటోలు
Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్