సీబీఐకి సుశాంత్‌ కేసు.. వారందరిలో గుబులు..?

By Satish ReddyFirst Published Aug 5, 2020, 2:54 PM IST
Highlights

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. 

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ కేంద్రానికి సిఫార్సు చేశారు. దీంతో కేంద్ర సీబీఐ విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సుశాంత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సుప్రీంకోర్ట్ కి తెలియజేయడం జరిగింది. 

ఇప్పటి వరకు సుశాంత్ ఆత్మహత్య కేసుపై ముంబై పోలీసులు, పాట్నా పోలీసులు వేర్వేరుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసు దర్యాప్తు విషయంలో బీహార్ పోలీసులకు... ముంబై పోలీసు అధికారులు సహకరించడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సుశాంత్‌ కేసు విచారణకు వెళ్లిన పట్నా సెంట్రల్‌ ఎస్పీ వినయ్‌ తివారిని బలవంతంగా క్వారంటైన్‌కు తరలించారు. దీనిపై బీహార్ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ సీఎంని కలిసి తన కొడుకు మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని..  సుశాంత్ ఆత్మ హత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. సుశాంత్ మరణం కేసులో ముంబై పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. ఈ కేసును సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వాలని కోరాడు. దీంతో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నట్లు బీహార్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. బీహార్ ప్రభుత్వ సూచనలను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి  దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 

దీనిపై సుప్రీంకోర్ట్ స్పందిస్తూ, ఇది హై ఫ్రొఫైల్ కేసు. ప్రతిభావంతుడైన కళాకారుడు (సుశాంత్) అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాలని వ్యాఖ్యానించింది. అంతేకాదు బీహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సరైనది కాదని తెలిపింది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. సుశాంత్ తండ్రి తరఫున బీహార్ ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్‌గి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ కోర్ట్ కి హాజరయ్యారు. కేంద్రం నిర్ణయంతో సుశాంత్‌ కేసులో నిందుతులుగా భావిస్తున్న రియా, ముంబయి పోలీసులు, బడా బాబుల  గుండెల్లో గుబుల పట్టుకుంది. 

click me!