రకుల్‌ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..?

Published : Aug 05, 2020, 12:57 PM IST
రకుల్‌ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..?

సారాంశం

సోషల్ మీడియా పేజ్‌ను నెటిజెన్లు భారీగా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ అరుదైన రికార్డ్‌ను అందుకుంది. రకల్‌ ఇన్‌స్టా పేజ్‌కు 15 మిలియన్ల(కోటీ 50 లక్షల)కు పైగా ఫాలోవర్స్ అయ్యారు.

కన్నడ సినిమా గిల్లితో వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ రకుల్ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో చిన్న సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు మహేష్ బాబు, రామ్‌ చరణ్‌ లాంటి హీరోలతో సూపర్‌ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. తెలుగులో సీనియర్‌ హీరో నాగార్జునతో మన్మథుడు 2 సినిమాలో నటించిన తరువాత మరో సినిమాలో కనిపించలేదు.

అయితే ఇటీవల బాలీవుడ్‌ మీద దృష్టి పెట్టిన ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌ అయ్యింది. క్లీవేజ్‌ షోతో పాటు హాట్‌ ఫోటోలను షేర్ చేస్తూ ఓ రేంజ్‌ లో రచ్చ చేస్తోంది. దీంతో అమ్మడి సోషల్ మీడియా పేజ్‌ను నెటిజెన్లు భారీగా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ అరుదైన రికార్డ్‌ను అందుకుంది. రకల్‌ ఇన్‌స్టా పేజ్‌కు 15 మిలియన్ల(కోటీ 50 లక్షల)కు పైగా ఫాలోవర్స్ అయ్యారు.

దీంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్  చేసింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.ఈ వీడియోలో తాను చిన్న వయసు నుంచే నటించటం ప్రారంభించానని నా పని, సోషల్ మీడియా ద్వారానే చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. తనకు మద్ధతుగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా కృత్జజ్ఞతలు తెలిపింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

PREV
click me!

Recommended Stories

Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు