ఫుల్‌ జోష్‌లో సాహో బ్యూటీ జాక్వెలిన్‌

Published : Aug 05, 2020, 02:24 PM ISTUpdated : Aug 05, 2020, 02:25 PM IST
ఫుల్‌ జోష్‌లో సాహో బ్యూటీ జాక్వెలిన్‌

సారాంశం

బీట్‌ పే బూటీ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ పాట ఆ తరువాత వచ్చే చాలా పాటలకు వ్యూస్‌ విషయంలో చాలెంజ్‌ విసిరింది. జాక్వెలిన్‌ పాటను చూసేందుకే కాదు ఆ పాటను పాడేందుకు, ఆపాటకు డ్యాన్స్ చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తికనబరిచారు.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాడెంజ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ బ్యూటీ నటించిన వీడియో సాంగ్స్ బీట్‌ బే బూటీ 4 సంవత్సరాలు, చంద్రలేఖ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఆనందంగా ఉంది. ఈ రెండు పాటలు ఘన విజయం సాధించటంతో పాటు రికార్డ్ వ్యూస్‌ సాదించాయి. 

ముఖ్యంగా బీట్‌ పే బూటీ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ పాట ఆ తరువాత వచ్చే చాలా పాటలకు వ్యూస్‌ విషయంలో చాలెంజ్‌ విసిరింది. జాక్వెలిన్‌ పాటను చూసేందుకే కాదు ఆ పాటను పాడేందుకు, ఆపాటకు డ్యాన్స్ చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తికనబరిచారు.

ఈ సందర్భంగా జాక్వెలిన్‌ మాట్లాడుతూ.. `నా పాటు బీట్‌ పే బూటీ 4 సంవత్సరాలు, చంద్రలేఖ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయంటే నమ్మలేకపోతున్నా. ఆ పాటలు షూటింగ్ జరిగిన రోజులను మిస్‌ అవుతున్నా. ముఖ్యంగా చంద్రలేఖ పాట కోసం పోల్‌ డ్యాన్స్ నేర్చుకున్న సందర్భంగా ఎన్నో అనుభావాలు ఉన్నాయి. ఆ పాటల్లో నర్తించటం ఎంతో ఎంజాయ్ చేశాను` అంటూ కామెంట్ చేసింది.

PREV
click me!

Recommended Stories

రామ్ చరణ్ కి స్కూల్లో మార్కులు తక్కువ రావడానికి కారణమైన మరో హీరో ఎవరో తెలుసా?
Chiranjeevi: డైరెక్టర్‌ కోసం కొరియోగ్రాఫర్‌గా మారిన చిరంజీవి.. `మన శంకర వర ప్రసాద్‌ గారు`లో రహస్యాలు లీక్‌