NagaChaitanya: `థ్యాంక్యూ` టీజర్‌ డేట్‌ ఫిక్స్.. వెరైటీగా అనౌన్స్ చేసిన నాగచైతన్య

Published : May 23, 2022, 05:35 PM IST
NagaChaitanya: `థ్యాంక్యూ` టీజర్‌ డేట్‌ ఫిక్స్.. వెరైటీగా అనౌన్స్ చేసిన నాగచైతన్య

సారాంశం

`థ్యాంక్యూ` చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. తన ఫ్యాన్స్ ని సడెన్‌గా సర్‌ప్రైజ్‌ చేశారు నాగచైతన్య. చిత్ర టీజర్‌ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. 

`లవ్‌ స్టోరీ` తర్వాత నాగచైతన్య నుంచి రాబోతున్న సినిమా `థ్యాంక్యూ`. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి  చేసుకుని డబ్బింగ్‌ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. తన ఫ్యాన్స్ ని సడెన్‌గా సర్‌ప్రైజ్‌ చేశారు నాగచైతన్య. చిత్ర టీజర్‌ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వెరైటీ వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. 

ఇందులో నాగచైతన్య ఆశ్చర్యపోతూ చెప్పిన విషయాలు ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య డబ్బింగ్‌ చెబుతున్నాడు. ఇందులో ఆయన `ప్రియ నేను రెడీ. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి` అని చెబుతుండగా, ఒకరు ఆయన్ని వీడియో తీస్తుంటారు. దీంతో ఏ ఏంటిది అంటూ దర్శకుడు విక్రమ్‌ కుమార్‌కి కంప్లెంట్‌ చేస్తారు. దీంతో ఆయన అసలు విషయంచెబుతారు. టీజర్‌ కోసమని చెప్పగానే నాగచైతన్య ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. మన సినిమా టీజరేనా? అని అడగ్గా, అవునని అంటాడు. ఎప్పుడని అడగడంతో మే 25న సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలు(5.04)లకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఈ వెరైటీ అనౌన్స్ మెంట్‌ ఆద్యంతం ఆట్టుకుంటుంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చితాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్ లోకి రాబోతుంది. నాగచైతన్య ఇందులో కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన లుక్‌ హైలైట్‌గా నిలవబోతుందని టాక్‌. తమ ఫ్యామిలీకి `మనం` వంటి మరిచిపోలేని హిట్‌ని అందించిన విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో `థ్యాంక్యూ`పై భారీ అంచనాలున్నాయి. సరికొత్త లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుందని టాక్‌. 

ఇదిలా ఉంటే ఇందులో నాగచైతన్య రెండు డిఫరెంట్‌ లుక్‌లో కినిపంచబోతున్నట్టు తెలుస్తుంది. ఆ రెండు లుక్‌ పిక్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఒకటి యంగ్‌ లుక్‌లో ఉండగా, మరోటి గెడ్డంతో సిగరేట్‌ తాగుతూ మాస్‌ లుక్‌లో ఉంది. ఈ రెండు లుక్‌లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా