కాన్సెప్ట్ ఆర్ట్ తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ అభిమాని.. స్పందించిన ‘సలార్’ చిత్ర యూనిట్.. వైరల్ అవుతున్నపోస్టర్స్

By team teluguFirst Published May 23, 2022, 4:57 PM IST
Highlights

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమాని ఒకరు ‘కాన్సెప్ట్ ఆర్ట్’తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. గుర్తించిన సలార్ టీం ఇలా స్పందించింది.
 

ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ పై అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూడు పెద్ద చిత్రాల అప్డేట్స్ గురించి ప్రభాస్ అభిమానులు కాచుకుర్చున్నారు. నెలలు నెలలు గడుస్తున్నా.. అప్డేట్స్ రాకపోవడంతో ఇంకెప్పుడు అంటూ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ‘ఆదిపురుష్’పైనా.. వారం కింద ‘సలార్’ అప్డేట్స్ పైనా అభిమానులు నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నారు. అయితే మరికొంత మంది అభిమానులు తమ హీరో సినిమాలో ఎలా కనిపించనున్నాడో ఊహించుకుంటూ ఆర్ట్స్ వేస్తున్నారు. పోస్టర్లను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో తమ అభిమాన హీరోలు కొత్త సినిమాల్లో ఇలాగే కనిపిస్తారని ఆర్టిస్ట్ లు ఊహించిన గీసినవి ఆకట్టుకున్నాయి.

ఈ క్రమంలో ప్రభాస్ అభిమాని ఒకరు తాజాగా ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో ఎలా కనిపించనున్నాడోనని అద్భుతమైన కాన్సెప్ట్ ఆర్ట్ వేశారు. ఈ పోస్టర్స్ లో ప్రభాస్ మైన్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ సెక్యూరిటీ గార్డ్ ను చేతితో పట్టుకొని ఈడ్చుకుంటూ వస్తున్నట్టుగా ఆర్ట్ వేశారు. ఆ పోస్టర్స్ ను ట్వీటర్ లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో ‘సలార్ చిత్ర యూనిట్’ పోస్టర్స్ ను చూసి షాక్ అయ్యింది. ఈ అద్భుతమైన ఆర్ట్స్ ను తమ అఫిషియల్ ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ‘అమేజింగ్ ఆర్ట్ వర్క్’ అంటూ అభినందించారు. తాలా అనే ఆర్టిస్ట్ ఇలా కొత్త  సినిమాల కాన్సెప్ట్ ఆర్ట్స్ వేస్తూ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 

ఇక సలార్ చిత్రం రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనుంది.  ఇప్పటికే 30-35 శాతం షూటింగ్ పూర్తయినట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపిన విషయం తెలిసిందే. 2023 సమ్మర్ కానుకగా మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ (Shruthi Haasani) నటిస్తున్నారు. అలాగే  కన్నడ స్టార్ హీరో ప్రుథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని హుంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  

 

Amazing work 🔥 https://t.co/4hn90hKPMC

— Salaar (@SalaarTheSaga)
click me!