త్రివిక్రమ్‌ `అ` సెంట్‌మెంట్‌.. మహేష్‌ సినిమాకి టైటిల్‌ కన్ఫమ్‌ ?

Published : May 23, 2022, 04:18 PM ISTUpdated : May 23, 2022, 04:23 PM IST
త్రివిక్రమ్‌ `అ` సెంట్‌మెంట్‌.. మహేష్‌ సినిమాకి టైటిల్‌ కన్ఫమ్‌ ?

సారాంశం

సూపర్‌స్టార్‌ మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రానికి ఓ ఆసక్తికర టైటిల్‌ వైరల్‌ అవుతుంది.

సినిమాలకు ప్రస్తుతం పెద్ద ఛాలెంజ్‌ ఏదైనా ఉందంటే అది ఒకటి స్టార్‌ హీరోలకు హీరోయిన్లు సెట్‌ కావడం, రెండు టైటిల్స్ కన్ఫమ్‌ కావడం. ఈ రెండు ఒక పట్టాన ఓకే కావు. సోషల్‌ మీడియాలో, అటు చిత్ర పరిశ్రమలో నానుతూ ఉంటాయి. వీటిపైనే ప్రధానంగా రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. ఇదే పెద్ద చర్చనీయాంశంగానూ మారుతుంటుంది. చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించేంత వరకు ఏదీ నిజం కాదన్నట్టుగానే ఉంటుంది. అన్ని రూమర్స్ గానే పరిగనించబడతాయి. అయితే ఈ లోపు  ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చిన, వినిపించే పేర్లని వైరల్‌ చేస్తుంటారు. 

తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇది పూజా కార్యక్రమాలు జరుపుకున్న నేపథ్యంలో ఇక రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. పక్కా ప్లానింగ్‌తో శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది త్రివిక్రమ్‌ టీమ్‌. అందుకోసం ముందస్తు కార్యక్రమాలపై మాటల మాంత్రికుడు ఫుల్‌ ఫోకస్‌ పెట్టారని సమాచారం. స్క్రిప్ట్ కూడా లాక్‌ చేసినట్టు సమాచారం.

ఇదిలా ఉంటేఈ చిత్రానికి టైటిల్‌ ఏంటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి `అర్జునుడు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. సినిమా కమర్షియల్‌ వేలో ఉండబోతుందని టాక్‌. మరి `అర్జునుడు` టైటిల్‌ ఎలా సెట్‌ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్రివిక్రమ్‌కి `అ` అనేది సెంటిమెంట్‌. ఆయన రూపొందించిన చిత్రాల్లో చాలా వరకు మొదటి అక్షరం `అ` ఉంటుంది. `అతడు`, `అ ఆ`, `అజ్ఞాతవాసి`, `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` వంటి చిత్రాలన్నీ `అ`తోనే స్టార్ట్ అయ్యాయి. ఒక్క `అజ్ఞాతవాసి` సినిమా తప్ప అన్ని బ్లాక్‌ బస్టర్సే కావడం విశేషం. దీంతో అదే సెంటిమెంట్‌ని త్రివిక్రమ్‌ ఫాలో అవుతున్నారట. 

ఇదిలా ఉంటే మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన `అతడు` సినిమాలో హీరో పేరు పార్థు. అదే టైటిల్‌గా పెట్టబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే అర్జునుడు మరో పేరు పార్థు కావడంతో `అర్జునుడు`గా ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్‌. మే 31న కృష్ణ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని విడుదల చేసే ఛాన్స్ ఉందని టాక్‌. మరోవైపు మహేష్‌ ఇప్పటికే `అర్జున్‌` పేరుతో ఓ సినిమా చేశారు. ఇది బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. మళ్లీ అలాంటి పేరునే టైటిల్‌గా పెడతారా? అనే డౌట్స్‌ వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఫైనల్‌గా ఏది ఖరారు అవుతుందనే తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ