Thank You Teaser: ఎన్నో వదులుకున్నా.. లైఫ్‌లో కాంప్రమైజ్‌ కానంటోన్న నాగచైతన్య.. రియల్‌ లైఫ్‌ అనుభవాలా?

Published : May 25, 2022, 05:29 PM ISTUpdated : May 25, 2022, 05:53 PM IST
Thank You Teaser: ఎన్నో వదులుకున్నా.. లైఫ్‌లో కాంప్రమైజ్‌ కానంటోన్న నాగచైతన్య.. రియల్‌ లైఫ్‌ అనుభవాలా?

సారాంశం

స్టూడెంట్‌ నుంచి బిజినెస్‌ మ్యాన్‌ వరకు నాగచైతన్య ఎదిగిన తీరు, ఆయన జీవితంలోని లవ్‌, కెరీర్‌ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

ఎన్నో వదులుకుని ఇక్కడ వరకు వచ్చాను. ఇక కాంప్రమైజ్‌ అయ్యేది లేదంటున్నాడు నాగచైతన్య. అంతేకాదు తనని తాను సరి చేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయాణమే `థ్యాంక్యూ` అంటూ తెలిపారు. ఇదంతా తాను నటిస్తున్న `థ్యాంక్యూ` చిత్ర టీజర్‌లో ఆయన చెప్పిన డైలాగ్‌లు. స్టూడెంట్‌ నుంచి బిజినెస్‌ మ్యాన్‌ వరకు నాగచైతన్య ఎదిగిన తీరు, ఆయన జీవితంలోని లవ్‌, కెరీర్‌ని ఆవిష్కరించేలా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `థ్యాంక్యూ` టీజర్‌ బుధవారం సాయంత్రం విడుదలయ్యింది. లవ్‌, ఎమోషన్స్ మధ్య సాగే ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

ఇందులో మొదటగా.. `నా సక్సెస్‌కి నేనే కారణం` అని నాగచైతన్య చెప్పడంలో టీజర్‌ ప్రారంభమైంది. ఆయన బిజినెస్‌మ్యాన్‌గా మేగజీన్‌లో కవర్‌ పేజీలో పడేంత స్థాయికి ఎదిగడం చూపించారు. ఆ తర్వాత `నువ్వు సెల్ఫీష్‌, ఆరోగెంట్‌ `అంటూ రాశీఖన్నా తిట్టడం, నేను తప్ప నీ లైఫ్‌లో ఇంకొక్కరికి చోటే లేదని చెప్పడం, ఆ తర్వాత నాగచైతన్య లైఫ్‌ జర్నీని చూపించారు. ఆయన స్కూల్‌లో మాళవిక నాయర్‌తో ప్రేమలో ఉండటం, ఆ తర్వాత స్పోర్ట్స్ పర్సన్‌గా ఉన్నప్పుడు అవికా గోర్‌తో ప్రేమలో ఉండటం, బిజినెస్‌ మ్యాన్‌గా ఎదిగాక రాశీఖన్నాతో ప్రేమలో ఉండటం చూపించారు. 

ఈ క్రమంలో `ఎన్నో వదులుకుని ఇక్కడి వరకు వచ్చాను. ఇక లైఫ్‌లో కాంప్రమైజ్‌ అయ్యేది లేదు`, `నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేసే జర్నీనే థ్యాంక్యూ` అని చెప్పడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇదొక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ చిత్రమని అర్థమవుతుంది. నాగచైతన్య పాత్ర లైఫ్‌లోని ప్రేమ, ఎమోషన్స్, కెరీర్‌ వంటి మూడు అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందని అర్థమవుతుంది. చైతూ మూడు డిఫరెంట్‌ లుక్స్ లో కనిపించబోతున్నారు. టీజర్‌ చాలా కొత్తగా ఉంది. సినిమాలపై అంచనాలను పెంచుతుంది.

ఇదిలా ఉంటే చైతూ ఇందులో చెప్పే డైలాగ్‌లు ఆయన రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉండటం మరో విశేషం. ఇదే ఇప్పుడు సరికొత్త చర్చకి తెరలేపుతుంది. ఇక విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నాగచైతన్యకి జోడీగా రాశీఖన్నాతలోపాటు అవికాగోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ కీలక పా్తర పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రమిది. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.జులై 8న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?