
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే (Karan Johar Birthday)నేడు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు, చిత్ర ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ ఓ క్యూట్ ఫోటో పంచుకున్నారు. అలాగే ఎమోషనల్ నోట్ తో కూడిన బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఇలా సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆయన 50వ బర్త్ డే నేపథ్యంలో గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మే 25 బుధవారం సాయంత్రం ముంబైలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. షారుక్ ఖాన్, మలైకా అరోరా, అర్జున్ కపూర్, అలియా భట్, రన్బీర్ కపూర్, జాన్వీ కపూర్ తో పాటు పలువురు హాజరుకానున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ కి చెందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందాన (Rashmika Mandanna)లకు కూడా ఈ బర్త్ డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందిందట. వీరిద్దరూ జంటగా హాజరుకానున్నారట.
విజయ్ లేటెస్ట్ మూవీ లైగర్ (Ligar)నిర్మాణ భాగస్వామిగా కరణ్ జోహార్ ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. అలాగే విజయ్ దేవరకొండతో కరణ్ జోహార్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక రష్మిక హిందీలో వరుసగా చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరికీ కరణ్ బర్త్ డే పార్టీకి ఆహ్వానం అందింది.
ఇక కొన్నాళ్ళుగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-రష్మికలు ప్రేమికులంటూ కథనాలు వెలువడుతున్నాయి. పలుమార్లు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి దొరికింది ఈ జంట. అలాగే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో రష్మిక పాల్గొనడం అనుమానాలకు బలం చేకూర్చింది. అయితే ఈ ఆరోపణలను విజయ్ దేవరకొండ, రష్మిక ఖండిస్తున్నారు.