థ్యాంక్యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు..? ఎక్కడా..?

Published : Jul 16, 2022, 01:10 PM IST
థ్యాంక్యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్, ఎప్పుడు..? ఎక్కడా..?

సారాంశం

రిలీజ్ కు రెడీ అయ్యింది నాగచైతన్య థ్యాంక్యూ మూవీతో రిలీజ్ కు రెడీగా ఉన్నారు. వరుస ప్రమోషన్స్ తో హడావిడి చేస్తున్నారు టీమ్.. ఇక ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ కోసం డేట్ టైమ్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.   

అక్కినేని హీరో నాగచైతన్య మీరోగా మనం ఫేమ్ విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా థ్యాంక్యూ.  ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రయాణం లాంటిదే. ఆ ప్రయాణంలో చాలా మంది తారసపడుతుంటారు. కొత్తవార పరిచయాలు, సరికొత్త జ్ఞాపకాలు కలబోసిన సినిమా  థ్యాంక్యూ. తమ జీవితంలో ఇలా కలిసినవారందరికి  థ్యాంక్స్ చెప్పడమనే కంటెంట్ తో విక్రమ్ కుమార్ రూపొందించిన సినిమానే థ్యాంక్యూ. 

ఈ సినిమా ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో  ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో నిర్వహించనున్నారు. ప్రిరిలీజ్ కు సంబంధించిన డేట్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ.. పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఆంధ్ర యూనివర్సిటీ లోని సీఆర్ రెడ్డి కాన్వొకేషన్ హాల్ లో ఇందుకు గ్రాండ్ గా  వేదికను సిద్థం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితమే అధికారికంగా వెల్లడించారు.  

థ్యాంక్యూ మూవీలో చైతూ సరసన హీరోయిన్లు గా  రాశి ఖన్నా, మాళవిక నాయర్ , అవికా గోర్ లు నటించారు. ఇక వరుస సినిమాలతో మంచి ఫామ్ ను మెయింటేన్ చేస్తున్నాడు నాగచైతన్య. లవ్ స్టోరీ సూపర్ హిట్ తరువాత బంగార్రాజు తో మరో హిట్ పడింది. ఆతరువాత ప్రస్తుతం థ్యాంక్యూ మూవీ కూడా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈసినిమా సక్సెస్ తో హ్యాట్రిక్ హిట్ ను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలి అని చూస్తున్నాడు నాగచైతన్య. 

PREV
click me!

Recommended Stories

తనూజ వల్ల ఇంట్లో 4 రోజులు ఏడుస్తూ ఉండిపోయిన సుమన్ శెట్టి భార్య.. దూరంగా ఉండమని చెప్పి, ఏం జరిగిందంటే
Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?