
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి అక్కడా సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడాయన రణ్‌బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కంటిన్యూ షెడ్యూల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక భాగాన్ని పూర్తి చేసారు. ఈ సందర్బంగా రణబీర్ సినిమా గురించి మాట్లాడారు.
రణబీర్ మాట్లాడుతూ...‘‘నా కంఫర్ట్ జోన్‌కు పూర్తి దూరంగా ఉండే పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నా. చాలా షాకింగ్ క్యారెక్టర్ ఇది. గ్రే షేడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అదే సమయంలో లోపల కాస్త భయంగానూ ఉంది’’ అని రణ్‌బీర్ తెలిపారు.
ఇదొక విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా కోసం రణ్‌బీర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. హిమాలయాల్లోనే రెగ్యులర్ చిత్రీకరణ కొనసాగుతోంది. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. రష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంలో గీతాంజలి అనే పాత్రలో ఆమె కనిపించనుంది.