ఆ స్టార్ హీరోల వల్లే బాలీవుడ్ మునిగిపోతోంది, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ సంచలన వ్యాఖ్యలు

Published : Jul 16, 2022, 12:36 PM IST
ఆ స్టార్ హీరోల వల్లే బాలీవుడ్ మునిగిపోతోంది, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రీ. బాలీవుడ్ కు ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితి కి కారణం ఆస్టార్ హీరోలే అన్నారు వివేక్.   

చాలా చిన్న సినిమాగా తెరకెక్కి.. ఎలాంటి అంచనాలు లేకుండానే, కశ్మీర్ పండిట్ల సెంటిమెంట్ తో రూపొంది రిలీజ్ అయిన సినిమా కశ్మీర్ ఫైల్స్. ఈమూవీ దేశవ్యాప్తంగా  ఘన విజయం సాధించింది. ప్రభుత్వ రాయితీలు, స్పెషల్ షోలతో  దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ కూడా సాధించిందీ మూవీ. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కశ్మీర్ ఫైల్స్'.  బాక్సాఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 300 కోట్ల వరకూ  వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమా దర్శకుడు వివేక్ మాత్రం వివాదాస్పద కామెంట్స్ తో ఎప్పుడూ వర్తల్లో నిలుస్తున్నారు. 

గతంలో బాలీవుడ్ పై రకరకాల కామెంట్స్ చేసిన వివేక్...తాజాగా బాలీవుడ్ స్టార్లను ఉద్దేశించి కూడా అంతకు మించి వ్యాఖ్యలు చేశారు వివేక్ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ లో  సంచలనం రేపుతున్నాయి. కింగ్ లు, బాద్షాలు, సుల్తాన్ లు ఉన్నంత వరకు బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొన్ని తరాలుగా బాలీవుడ్ ను గుప్పెట్లో పెట్టుకున్న స్టార్స్ నుంచి బాలీవుడ్ బయటకు రావాలి అన్నారు. కమర్షియల్ సినిమాలో పాటు ప్రజల సినిమాలు చేయాలనన్నారు.

ప్రజల గాథలతో సినిమాలను తీయాలని, బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చాలని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. అప్పుడే బాలీవుడ్ ప్రపంచ స్థాయికి ఎదుగుతుంది అన్నారు. హిందీ  చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని వివేక్ సలహా ఇచ్చారు. అంతే కాదు . బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను ఉద్దేశించే వివేక్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు సినిమా పండితులు అభిప్రాయ పడుతున్నారు. వివేక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో  చర్చనీయాంశంగా మారాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా