పెళ్లి ఒకరితో… ఫస్ట్ నైట్ ఇంకొకరితో అంటే ఎలా..!

Surya Prakash   | Asianet News
Published : Dec 23, 2021, 07:56 AM ISTUpdated : Dec 23, 2021, 09:19 AM IST
పెళ్లి ఒకరితో… ఫస్ట్ నైట్ ఇంకొకరితో అంటే ఎలా..!

సారాంశం

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సామెత సినిమా నుంచి తమన్ మ్యూజిక్ లో చాలా మార్పులు వచ్చాయి. ఆ తర్వాత అల వైకుంఠపురంలో సినిమా మ్యూజిక్ ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది.  ఇటీవల వచ్చిన అఖండ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 

ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ గురించే. అఖండలో ఆయన ఇచ్చిన రీరికార్డింగ్ స్పెషల్ గా అందరూ మాట్లాడుకున్నారు. ఆయన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తమన్‌ తనదైన ముద్ర వేసారు. ఏ స్టార్‌ హీరో సినిమా ప్రారంభం అయినా  సంగీత దర్శకుడు ఎవరు అంటే తమన్‌ పేరే వినిపిస్తోంది.  హీరోలు, డైరెక్టర్లు కూడా తమన్‌తోనే పని చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మ్యూజిక్‌ సన్సెషన్‌ ఈ స్థాయికి ఊరికే రాలేదని, దాని వెనక ఎంతో కష్టం ఉందని చెప్పాడు  థమన్, తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.  తమన్‌ మాట్లాడుతూ ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.  దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, పలు ఆసక్తికర అంశాలను ఈ ప్రోమోలో కట్ చేసారు. 

 టాలీవుడ్ లో ఇంత సక్సెస్ అయిన నువ్వు, బాలీవుడ్ లో ఎందుకు అలా… అన్న ప్రశ్నకు, ‘ఇప్పటి వరకు 3 సినిమాలకు వర్క్ చేసానని, కానీ ఒక సినిమాకు ఐదారుగురు సంగీత దర్శకులు పని చేయడం ఏమిటో నాకు అర్ధం కాదని, ఒక పాటకు ఒక్క సంగీత దర్శకుడు అని చెప్పడం, ఆర్ఆర్ కూడా అక్కడక్కడా వర్క్ చేయడం అనేది, పెళ్లి ఒకరితో ఫస్ట్ ఇంకొకరితో అన్న రీతిలో ఉంటుందని నవ్వేశారు థమన్. తన ఇంట్లో తన భార్యే బాగా ట్రోల్ చేసేస్తుందని, తనకు ఇంట్లో ఉన్న ట్రోలింగ్ ఎక్కువని, అందుకే బయట ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోనని తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ప్రస్తావించారు. 

తన మొదటి సంపాదన ‘భైరవద్వీపం’ సినిమాకు 30 రూపాయలు వచ్చాయని, ఆ సినిమాలో రోజా పైకి లేచినప్పుడల్లా డ్రమ్స్ వాయించింది తానేనని చెప్పుకొచ్చారు. ‘మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవారు.. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు. నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్‌తో నేను సాధన చేస్తూ డ్రమ్మర్‌గా ముందుకు వెళ్లాను.

Also read Shyam Singha roy: బాలయ్యని వెనకేసుకొచ్చిన నాని.. కమల్‌ సినిమాకి సంబంధం లేదట!

తనకు బాడీలో బరువుంది కాబట్టి, హెడ్ లో వెయిట్ లేదని, తెలుగు రాయడం అనేది త్రివిక్రమ్ గారితో పని చేసినప్పటి నుండి నేర్చుకుంటున్నానని అన్నారు. 2000లో శంకర్ గారి సినిమాలో చేసిన తాను 2020లో శంకర్ గారి సినిమాకు పని చేయడం పట్ల సంతోషంగా ఉన్నానని, ఆ ఫోటోలో తాను వేసుకున్న సూట్ తనకు సూట్ కాలేదన్న పంచ్ లతో ఈ ప్రోమోను కట్ చేసారు.

తమన్‌ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ మాస్‌ బీజీయంకు ఆమెరిక బాక్సాఫీసు సైతం దద్దరిల్లింది. కాగా ప్రస్తుతం తమన్ ‘భీమ్లా నాయక్’​​ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వరుణ్ తేజ్​ ‘గని’, అఖిల్​ ‘ఏజెంట్’తో పాటు శంకర్​ దర్శకత్వంలో రామ్​ చరణ్ నటిస్తున్న సినిమాకు కూడా తమన్ స్వరాలు అందిస్తున్నాడు.

 

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు