ఆహా 'ఇండియన్ ఐడల్ 2' సెట్స్ లో తమన్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్.. ఈసారి ఆమె మిస్సింగ్

Published : Feb 11, 2023, 03:23 PM ISTUpdated : Feb 11, 2023, 03:24 PM IST
ఆహా 'ఇండియన్ ఐడల్ 2' సెట్స్ లో తమన్, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్.. ఈసారి ఆమె మిస్సింగ్

సారాంశం

ఆహా ఓటిటి సంస్థ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే కార్యకమ్రాలతో దూసుకుపోతోంది. శరవేగంగా ఆహాకి సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారు. కామెడీ షోలు, సిరీస్ లు, అన్ స్టాపబుల్ లాంటి బ్లాక్ బస్టర్ టాక్ షోలతో ఆహా సంస్థ దూసుకుపోతోంది. ఇప్పుడు ఆహా మరో ఆసక్తికర షోకి రెడీ అవుతోంది.

ఆహా ఓటిటి సంస్థ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే కార్యకమ్రాలతో దూసుకుపోతోంది. శరవేగంగా ఆహాకి సబ్ స్క్రైబర్లు పెరుగుతున్నారు. కామెడీ షోలు, సిరీస్ లు, అన్ స్టాపబుల్ లాంటి బ్లాక్ బస్టర్ టాక్ షోలతో ఆహా సంస్థ దూసుకుపోతోంది. ఇప్పుడు ఆహా మరో ఆసక్తికర షోకి రెడీ అవుతోంది. గత ఏడాది ఇండియన్ ఐడల్ సీజన్ 1 నిర్వహించగా మంచి స్పందన దక్కించుకుంది. 

ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం ఆహా ముస్తాబవుతోంది. ఆల్రెడీ షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలి సీజన్ లో తమన్, సింగర్ కార్తీక్, నటి నిత్యామీనన్ జడ్జీలుగా వ్యవహరించారు. సీజన్ 2లో నిత్యామీనన్ మిస్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమన్, కార్తీక్ కొనసాగనున్నారు. 

తమన్ ఇండియన్ ఐడల్ 2లోకి ఎంటర్ అవుతున్న దృశ్యాలు లీక్ అయ్యాయి. తమన్ గ్రీన్ జాకెట్ ధరించి స్టైలిష్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. మేళతాళాల మధ్య తమన్ ఎంట్రీ ఇస్తున్నాడు. 

నిత్య మీనన్ సీజన్ 2కి మిస్ అవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్థానంలోకి ఎవరిని తీసుకువస్తారనేది ఆసక్తిగా మారింది. గత సీజన్లో నెల్లూరుకి చెందిన వాగ్దేవి టైటిల్ విజేతగా నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?