SSMB28 : మహేశ్ బాబు సినిమా కోసం భారీ సెట్? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారంటే?

By Asianet News  |  First Published Feb 11, 2023, 10:58 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తైంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది.
 


 

చివరిగా ‘సర్కారు వారి పాట’తో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh babu) బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబు భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. వరుస హిట్లను అందిస్తున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ 28వ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే పూర్తి కావాల్సిన ఈసినిమా ఆయా కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేళలకు ప్రారంభమై ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. 

Latest Videos

ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ - మహేశ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎంబీ28’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈనెక్ట్స్ షెడ్యూల్ కోసం యూనిట్ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో  రూ.10 కోట్లతో ఓ విలాసవంతమైన ఇంటిని  నిర్మిస్తున్నారంట. ఈసెట్ లోనే చాలామేరకు షూటింగ్ జరగనుందని అంటుున్నారు. అందుకే భారీగా ఖర్చు చేసి సెట్ వేయిస్తున్నారని ప్రచారం. 

ప్రస్తుతం మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ తో కలిసి మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు. స్పెయిన్ లో పెళ్లిరోజు వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు తిరిగి వచ్చాక నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి మూడో వారంలో షూటింగ్ మొదలు కానుందని అంటున్నారు. ఇక మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో పదేండ్ల తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

‘ఎస్ఎస్ఎంబీ28’లో మహేశ్ బాబును సరికొత్తగా చూపించబోతున్నారు. ఇప్పటికే మహేశ్ లుక్, హెయిర్ స్టైల్, కాస్తా గడ్డంతో మాస్ లుక్ కు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో సరికొత్త దర్శనం కలుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. చిత్రంలో పూజా హెగ్దే (Pooja Hegde), శ్రీలీలా (Sreeleela) హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. 

click me!