
తెలుగు హీరోలపై నోటికోచ్చినట్టు వాగుతూ.. చేతికోచ్చినట్టు రాస్తూ.. ట్రోల్స్ చేస్తున్న తమిళ హీరో అభిమానుల నోళ్లు మూయిస్తున్నారు బాలయ్య బాబు ఫ్యాన్స్. వీడియోస్ తో సహా నిరూపిస్తూ.. తమిళ తంబీలకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నారు.
ఏభాషలో అయినా.. ఏఇండస్ట్రీలో అయినా ఫ్యాన్స్ కామన్.. స్టార్ హీరోలను అభిమానులు.. వీరాభిమానులు కామన్. హీరోల మీద అభిమానంతో తమ హీరోనే గొప్ప అని చెప్పుకోండం కూడా కామన్. ఇక ఫ్యాన్స్ మధ్య యుద్దాలు కూడా కామన్ అయిపోయాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకసారి రిలీజ్ అయ్యాయంటే ఇక ఆ గొడవలకు అంతే ఉండదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. తమిళనాడులో కూడా ఫ్యాన్స్ వార్ కామన్ గా జరిగేదే. ముఖ్యంగా అక్కడ అజిత్ . విజయ్ ఫ్యాన్స్ మధ్య గొడవలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటాయి.
అయితే ఏ ఇండస్ట్రీల్లో గొడవలు ఆ ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది కాని.. పక్క రాష్ట్రాల మీద పడి.. అక్కడి హీరోలను కూడా బ్లేమ్ చేయాలి అని చూస్తే.. ఎందకు ఊరుకుంటారు. ప్రస్తుతం అదే జరుగుతుంది టాలీవుడ్-కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య. ఈమధ్య కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ కు ఏం పనిలేక నెట్టింట్లో పిచ్చిపిచ్చిపోస్ట్ లు పెట్టడం స్టార్ట్ చేశారు. తెలుగు హీరోలలో 48 ప్లాస్ లో ఉన్న తెలుగు హీరోలు ఎవరైనా.. విజయ్ లా డాన్స్ చేయగలరా..అంటూ.. అనవసరంగా తెలుగు హీరోల ప్న్యాన్స్ ను కదిలించి వదిలిపెట్టారు. ఇక మనవాళ్లు ఊరుకుంటారా... పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్న కొంత మంద తమిళ ఫ్యాన్స్ నోర్లు మూయించేలా వీడియోలతో సహా పోస్ట్ చేసి.. వాళ్ల నోర్లు మూయించారు.
ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తెలుగు హీరోలకు డాన్స్ రాదనా మీ ఉద్దేశ్యం. మీ హీరో చేసేదే డాన్స్ అంటే.. మరి మాహీరోలను చూడండి. అంటూ బాలయ్య 48 దాటాక.. 51 ఏజ్ దాటాక.. ఇంకా 60 ప్లాస్ తరువాత కూడా ఎలాంటి స్టెప్పులు వేశాడో వీడియోలతో సహా పోస్ట్ చేసి..వాళ్లకు బుద్ది చెప్పారు. అంతే కాదు మా సంపూర్ణే బాబు మీ విజయ్ కంటే కూడా గొప్పగా డాన్స్ చేయగలడూ అంటూ కామెంట్ చేస్తూ.. ఒక ఆట ఆడుకున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్.
విజయ్ ఫ్యాన్స్ వాగిన వాగుడికి మనోళ్లకి మండింది.. ఇక బాలయ్య ఫ్యాన్స్.. వజ్రోత్సవాలప్పుడు వేసిన డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మరోయిన్లతో కలిసి బాలకృష్ణ చేసిన డాన్స్ చూసి కళ్ళు చెదిరిపోవాలి.చివరిలో ఆయన ఇచ్చిన ట్వీస్ట్ కు అంతా షాక్ అయ్యారు.
అంతే కాదు బాలయ్య బాబు 50+లో ఉన్నప్పుడు సింహా సినిమా కోసం వేసిన అద్బుతమైన స్టెప్స్ ను కూడా శేర్ చేశారు ఫ్యాన్స్. ఈ పాటలో బాకృష్ణ డాన్స్ తో నిజంగా మెస్మరైజ్ చేశారు. అవతలివారు ఒక్క మాట కూడా అంటానికి ఆస్కారం లేకుండా చేశాడు.
అంతటితొ వదలిపెట్టకుండా 60+లోనూ.. ఎంతో ఈజ్ తో బాలయ్య చేసిన స్టైప్స్ సబంధించి మరో వీడియోను పోస్ట్ చేశారు ఫ్యాన్స్. వీర సింహా రెడ్డి లోని సోడా బండి స్టెప్స్ ను అదరగొట్టాడు బాలయ్య. ఈ వీడియోస్ షేర్ చేస్తున్నారు.
ఇక విజయ్ డాన్స్ కంటే మా ఇండస్ట్రీలో కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు డాన్స్ ఇంకా బాగుంటుందని. విజయ్ కంటే కూడా మా సంపూ బాగా డ్యాన్స్ చేస్తాడంటూ వీడియోలతో కామెంట్స్ చేయడంతో.. మనోళ్ల దెబ్బకి విజయ్ ఫ్యాన్స్ నోళ్లు మూసుకున్నారు..
అభిమానం ఉందడబచ్చు కాని అది మితిమీరిపోకూడదు. ఎంత స్టార్ హీరో అయినా.. ఎంత చిన్న హీరో అయినా.. ఏ ఇండస్ట్రీ అయినా.. ఎవరి గొప్ప వారిదే.. ఎవరి మైనస్ పాయింట్లు వారివే. మన తప్పులను చూడకుండా ఎదుటవారిని వేలెత్తి చూపిస్తే.. ఇలానే నోర్లు మూసుకోవల్సి వస్తుంది. గతంలో కూడా ఇంతే.. విజయ్ ఫ్యాన్స్ మహేష్ బాబును పిచ్చి పిచ్చిగా వాగి.. సూపర స్టార్ ఫ్యాన్స్ డైలాగ్స్ కు నోర్లు మూసుకుని కూర్చున్నారు.